రోజూ ఓ యాపిల్​ తింటే డాక్టర్​ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదంటారు. కానీ.. రోజూ యాపిల్​ తినడం అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే యాపిల్​ కాస్త కాస్ట్​లీ కదా! కనీసం 30 రూపాయలు పెడితేకానీ ఓ యాపిల్​ను కొనలేం. మరి అదే 30 రూపాయలతో అర‌కిలో జామపండ్ల‌ను కొనుక్కోవచ్చు. పైగా యాపిల్​తో పోలిస్తే జామపండ్లతో ఆరోగ్య ప్రయోజనాలూ ఎక్కువే. అందుకే జామపండును ‘పేదోడి యాపిల్​’ అంటారు. ‘పేదోడి యాపిల్​’గా చెప్పుకునే జామపండు చేసే మేలు గురించి మనందరికీ తెలుసు. మరి జామ ఆకు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందనే విషయం మీకు తెలుసా? 

 

జామపండు, దానిలో ఉండే పోషకాలు, తింటే కలిగే ప్రయోజనాల గురించి తెలిసిందే. కానీ.. జామపండుతో సమానంగా జామ ఆకులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. నిజంగా ఈ ప్రయోజనాల గురించి అందరికీ తెలిస్తే.. పండ్లే కాదు, జామ ఆకులు కూడా కొనుక్కోవాల్సిన రోజులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నవి తింటే.. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అయితే జామ ఆకులో ఈ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే జామపండు కంటే జామ ఆకులోనే ఆరోగ్యప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతారు న్యూట్రిషన్స్​. నొప్పులు, వాపులను తగ్గించే ఔషధ గుణాలు జామ ఆకులో ఉన్నాయి. జలుబు, దగ్గు, ఊపిరి సమస్యలు, పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి, నోటిపూత లాంటి ఎన్నో సమస్యలను నయం చేస్తుంది. 

 


జామ ఆకు ప్ర‌త్యేక‌త‌లు ఇంత‌టితో అయిపోలేదు. జామ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్​–సితోపాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే క్వర్సిటిన్, ఫ్లవనోల్ మంచి ఫ్లెవనాయిడ్స్ జామ ఆకులో ఉంటాయి. పొటాషియం, ఫైబర్ కూడా జామ ఆకులో ఎక్కువే. ఇవన్నీ ఉన్నందునే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. జామ ఆకుల రసం తాగితే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్​లో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లకు ఇది ఎంతో మేలు చేస్తుంది. తిన్న తర్వాత ఓ కప్పు జామ ఆకు టీ తాగితే షుగర్​కు సంబంధించిన అన్నిరకాల సమస్యల నుంచి బయటపడొచ్చు. ఈ టీ చేసుకోవడం కూడా చాలా ఈజీ. నాలుగు జామ ఆకుల్ని నీటిలో పది నిమిషాలు ఉడికించి, ఆ నీటిని తాగేయడమే. ఈ కాస్త వగరుగా ఉన్నా.. ఆరోగ్యానికి చేసే అంతాఇంతా కాదు. మార్కెట్​లో జామ ఆకుల టీపొడి కూడా లభిస్తోంది. అయితే నేచురల్​గా ఆకులను మరగబెట్టుకొని తాగడమే బెటర్​.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: