అందరం కలిసి సరదాగా రెస్టారెంట్ కి వెళ్ళటం, కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేయటం, అలా కబుర్లు చెప్పుకుంటూ తినటం ఎంత బాగుంటుందో కదా...వెయిటర్స్  కూడా మనతో సరదాగా మాట్లాడుతూ, ఆర్డర్ చేసినవి తెచ్చి వడ్డిస్తుంటారు. అన్నీ తినేసిన తరువాత, వెయిటర్ తెచ్చిన ఫింగర్ బౌల్ లో చేతులు పెట్టి హాయిగా ఫీల్ అవుతున్న సమయంలో సర్ బిల్ అంటూ వెయిటర్ వచ్చి చిన్న నవ్వు నవ్వుతూ బిల్ ఇస్తాడు. ఆ బిల్లు చూసి ఇంత తినేసామా అంటూ బిల్లు ఇచ్చేసి అతడి చేతిలో టిప్పు పెట్టి చెక్కేస్తారు. ఇంతవరకూ ఇదంతా ఎక్కడైనా కామన్ గానే జరుగుతుంది...కానీ..

 

అమెరికాలో ఓ యువకుడికి మాత్రం ఈ విషయంలో వింత అనుభవం ఎదురయ్యింది. రెస్టారెంట్ కి వెళ్లి కావాల్సిన ఫుడ్, వెయిటర్ కి ఆర్డర్ ఇచ్చి తెప్పిచుకొని ప్రశాంతంగా తిన్నాడు. మధ్యలో ఏవో సందేహాలు కూడా అడిగాడు, అంతా అయిపోయి చివరకు బిల్ అడిగాడు. సరే అని వెయిటర్ కూడా తెచ్చి ఇచ్చింది. ఆ బిల్ చూసి ఖంగు తిన్నాడు ఆ యువకుడు. ఎందుకంటే అందులో చెత్త ప్రశ్నలకి రూ. 27($ 0.38) అని ఉంది.  దాంతో ఆ యువకుడికి పట్టలేని  కోపం వచ్చేసింది. కానీ విచిత్రం ఏంటంటే ఆ చెత్త ప్రశ్నల తాలూకు బిల్లు అసలు బిల్లులో కలపలేదు. అది చూసిన అతడు నవ్వుకున్నాడు. అతడి నవ్వు చూసిన వితర్ కూడా నవ్వుకుంది.

 

ఆ రెస్టారెంట్ కి సదరు యువకుడు వెళ్ళడం అదే మొదటి సారి.కానీ ఆ రెస్టారెంట్ లో అదే ప్రత్యేకత. తమ హోటల్ కి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళే సమయంలో నవ్వుతూ ఉండాలనేది ఆ వెయిటర్ ఆలోచన అందుకే ఇలాంటి ప్రయోగం చేసింది. ఇదే పద్దతిని ఆ హోటల్ సుమారు 20 ఏళ్ళుగా కొనసాగిస్తోంది. ఇంతకీ ఈ హోటల్ ఎక్కడుందంటే అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలోగల  డెన్వర్ లో ఉంది. ఈ రెస్టారెంట్ పేరు TOM’s అటుగా వెళ్తే మీరు ఓ లుక్కేయండి మరి....

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: