ఎక్కువ‌గా గొడ‌వ‌లు ప‌డే జంట‌లే ఎక్కువ రొమాంటిక్‌గా ఉంటార‌ని ఇటీవ‌లె జ‌రిగిన స‌ర్వేలో తేలింది.  అంతే కాదు వారే ఎక్కువ కాలంపాటు క‌లిసి ప్ర‌యాణం చేస్తార‌ని కూడా అంటున్నారు కొంద‌రు నిపుణులు. అప్పలాచియన్ స్టేట్ యూనివర్సిటీ కథనం ప్రకారం.. 'ఎవరైతే ఒకరినొకరు రోజూ నిందించుకుంటూ ఎక్కువ‌గా గొడ‌వ ప‌డుతూ నిత్యం ఎక్కువ శాతం గొడ‌వ‌ల‌తోనే రోజును ప్రారంభిస్తారో  వాళ్లే రొమాన్స్‌లో పీక్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తారు' అని రీసెర్చ్ చెబుతుంది. అలా అని ఎంజాయ్‌మెంట్ కోసం గొడవలు పడితే మాత్రం హద్దులు మీరకుండా జాగ్ర‌త ప‌డాలి. అంటే ప్ర‌త్యేకించి దాని కోసం గొడ‌వ ప‌డ‌కూడ‌దు. భార్య భ‌ర్త‌లైనా ల‌వ‌ర్స్ అయినా ఇద్ద‌రి మ‌ధ్య అల‌క‌లు ఓదార్చుకోవ‌డాలు, కోప తాపాల‌నేవి ఎంతో స‌హ‌జం. వాటిని ఇద్ద‌రు ఒక‌రికి ఒర‌కు అర్ధం చేసుకోవ‌డంలోనే అస‌లు మ‌జా ఉంటుంది. 

 

ఇద్దరూ తరచుగా గొడవలు పడే క్షాణాల్లో సాధ్యమైనంత వరకూ సంభాషణను ఫన్నీగా ముగించడానికే ప్రయత్నించాలి. చిన్న చిన్న తప్పుల్ని ఎత్తి చూపుతూ పార్టనర్ ప్రేమను గెలవడానికి చొరవ చూపించాలి. ఏదైతే మీ భాగస్వామిలో బెస్ట్ అనుకుంటున్నారో దానిని ఎదుటివారితో పోలుస్తూ మాట్లాడితే వారిని రెచ్చగొట్టినట్లవుతుంది.  ఎప్పుడూ ఏ విష‌యంలో కూడా ఎవ్వ‌రూ ఒక‌రితో మ‌రొక‌రిని పోల్చ‌కూడదు. ఆ కంపేరిష‌న్ అనేది ఎప్పుడైతే వ‌స్తుందో అప్పుడే మ‌నుషుల మ‌ధ్య కాస్త దూరం పెరుగుతుంది. 

 

ఈ థియరీ 15వేల మంది పై 39పరిశోధనల ఫలితంగా దీనిని నిర్ధారించారు. చాలా వరకూ పార్టనర్‌లో సెన్సాఫ్ హ్యుమర్ కోసమే వెదుకుతుంటారు. మీరు ఎంత ఫన్నీగా ఉంటున్నారనే దానిపైనే మీ బంధం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా స‌రే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ వ‌చ్చినప్పుడు ఎదుటివారితో ఎలా స‌ర్దుకుపోతున్నాం అనేది ఆలోచించాలి. ఓ సినీ ఎవి చెప్పిన‌ట్లు ఎక్క‌డ నెగ్గాలో కాదు ఎక్క‌డ త‌గ్గాలో తెలిసిన‌వాడే అస‌లైన ప్రేమికుడు. మ‌నం త‌గ్గినంత మాత్రాన మ‌న‌కు పోయేదేమీ ఉండ‌దు. ఇంకా చెప్పాలంటే సెల్ఫ్ శాటిస్ ఫ్యాక్ష‌న్ బావుంటుందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: