ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్ ఉంటోంది. అందులో వాట్సప్, ఫేస్ బుక్, టిక్ టాక్ చాలా కామన్ అయ్యాయి. అయితే టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది.

ఈ సోషల్ మీడియాను మన మానవ సంబంధాల మెరుగు కోసం.. సమర్థవంతంగా వాడుకుంటే చాలా ఉపయోగపడతాయి. మనకు అవసరమైన గ్రూపులు తయారు చేసుకోవచ్చు. నిరంతరం వారితో టచ్ లో ఉండొచ్చు.

 

అయితే ఇక్కడే మరో అనర్థం పొంచి ఉంటుంది. అవసరం లేని విషయాలపై సోషల్ మీడియాలో ఎక్కువ సేపు గడపడం ఇటీవల కామన్ అయ్యింది. ఏదో ఒక దాని కోసం స్మార్ట్ ఫోన్ పట్టుకుంటే..అది మనల్ని ఎటో లాక్కెళ్లి.. మన సమయం వృథా చేస్తుంది. అందుకే.. టెక్నాలజీ పరంగా ఆన్‌లైన్‌లో ఎంత తక్కువగా గడిపితే అంత మంచిది.

 

రాత్రి ఎనిమిది తరువాత స్మార్ట్‌ఫోనును వాడొద్దని ఈ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకోండి. తల్లులు ఫోను వాడితే పిల్లలూ అడుగుతారు. రాత్రివేళ ఎక్కువ సమయం ఫోనులో గడిపే పిల్లలు శారీరక, మానసిక దుష్ప్రభావాల బారిన పడే అవకాశం ఉంది. వీటితోపాటు రోజూ స్క్రీన్‌ టైమింగ్‌ను సరిచూసుకోండి.

 

ఇక సోషల్ మీడియాలో.. నాకు అన్ని సామాజిక మాధ్యమాల్లో ఖాతాలున్నాయి’ అని గొప్పగా భావించడం మానేయండి. అవి మనకు ఎంత మేరకు ఉపయోగ పడుతున్నాయనేది గుర్తించండి. మాధ్యమాల్లో మన ఆసక్తులు, అభిరుచులను పెడుతూ గుర్తింపును పొందాలనుకోవడంలో తప్పులేదు. కానీ ఇలాంటివి నేనే అప్‌లోడ్‌ చేశానా? అనే ఆలోచన భవిష్యత్తులో రాకుండా చూసుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: