ప్రపంచంలో ప్రతీ ప్రాణి విభిన్నమైన గొంతులతో అరుస్తూ ఉంటాయి. కానీ ఒక్క ఆవు మాత్రం తాను అరిచే అరుపులో అమ్మా అనే పిలుపు అందరిని ఆశ్చర్య పరుస్తుంది. అంబా అంటూ ఆవులు అరవడం అందరూ వినే ఉంటారు కానీ ఒక్క సారి సరిగ్గా పరికించి వినండి తప్పకుండా ఆ పిలుపులో ఎదో అర్థం దాగి ఉందని అర్థమవుతుంది. మనిషి పుట్టిన తరువాత ఎలాగితే అమ్మా అని ఏడుస్తాడో అలాగే ఆవులు కూడా పుట్టిన వెంటనే అమ్మా అంటూ ఏడవడం, అమ్మా అంటూ తల్లి కావాలని పిలవడం మనసుకు ఎంతగానో హత్తుకుంటుంది. అయితే

 

అంబా అని పిలిచే పిలుపు కేవలం తల్లి కోసమే కాదు వాటి వాటి భావాలని తోటి ఆవులతో పంచుకోవడానికి, అంటే మాట్లాడుకోవడానికి ఉపయోగించుకుంటాయట.ఈ విషయంలో లోతైన పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు కొన్ని విషయాలని బయటపెట్టారు. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ శాస్త్రవేత్తలు ఆవుల అరుపులపై అధ్యయనం చేశారు. వాటి అరుపులలో భావాన్ని తెలుసుకోవానికి గూగుల్ ట్రాన్స్లేట్ వంటి ఓ పరికరాన్ని తయారు చేసిన ఉపయోగించారు.ఆవులు అంబా అని అరుస్తాయి కాని వాటి భావోద్వేగాలని బట్టి ఆరుపులో తీవ్రతలు ఉంటాయట.

 

ఆ తాలుకూ అరుపులు కేవలం తోటి ఆవులకి మాత్రమే అర్థమవుతాయని తెలిపారు. కోపాన్ని, సంతోషాన్ని, దుఖాన్ని ఇలా ప్రతీ స్పందనకి అరుపుల్లో తేడాలు ఉంటాయని తెలిపారు. ఈ క్రమంలోనే సుమారు 350 అవులపై ప్రయోగాలు చేసిన వాటి అరుపులు రికార్డ్ చేసిన శాస్త్రవేత్తలు వాటి అరుపుల్లో తేడాలని స్పష్టంగా గమనించారట. అంతేకాదు ఎక్కువ మొత్తంలో ఆవులు ఉన్నా ఏ ఆవు అరిచిందో కూడా అవి ఇట్టే పసిగట్టగలవని అంటున్నారు..

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: