టెక్నాలజీ వచ్చినప్పటినుండి మనిషి జీవితంలోని కనీస గోప్యత హరించుకుపోయింది. మనం ఎక్కడికి వెళ్ళేది గూగుల్ మ్యాప్ గుర్తిస్తుంది. మనం ఏం చేస్తున్నది సీసీ కెమెరాలు పసిగట్టేశాయి. మన స్మార్ట్ ఫోన్ చూస్తే చాలు మన గుట్టు అంతా బట్టబయలు అవుతుంది. ఇక బ్యాంక్ అకౌంటులు ఇతర ట్రాన్శాక్షన్ వివరాలు అన్నీ మనమేంటో చెప్పేస్తాయి. దీన్ని ఆసరాగా తీసుకుని హ్యకింగ్ టెక్నాలజీ వల్ల మన ప్రైవసీ పూర్తిగా దెబ్బతింటుంది అనడానికి ఇప్పుడు ప్రస్తావించబోతున్న ఒక సంఘటనే చక్కటి ఉదాహరణ.

 

ఢిల్లీ శివారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలోని ఒక కొత్త జంట ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకున్నారు. వారి శోభనానికి అదిరిపోయే రీతిలో ఏర్పాట్లు చేసుకున్న వారు తమ తొలి రేయి గూర్చి ఎన్నో కలలు కన్నారు. అనుకున్నట్టే తమ శోభనం రాత్రిని ఇద్దరూ తనివితీరా ఆస్వాదించాలంటే. ఎన్నో మధురానుభూతులు పొందిన వీరు జీవితాంతం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకున్నారు. కాని కట్ చేస్తే......

 

కొద్ది రోజులకి వారిద్దరి ఫస్ట్ నైట్ శృంగార వీడియో పోర్న్ సైట్ లో ప్రత్యక్షమైంది. ఫోన్ వీడియోలు చూస్తున్న ఆ యువకుడు చివరికి అది తన ఫస్ట్ నైట్ వీడియో అని తెలుసుకొని నిర్ఘాంతపోయాడు. ఎవరైనా చాటుగా వీడియో తీశారేమో అని అతని ఇల్లు మొత్తం గాలించినా ఎటువంటి ఆచూకీ దొరకలేదు చివరికి భార్య ఈ విషయం చెప్పిన తర్వాత ఇద్దరూ లబోదిబోమంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. 

 

దీంతో ఈ కేసును ఒక ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు వారి బెడ్రూమ్ మొత్తం ఎక్కడైనా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయేమో అని శోధన చేసిన వారికి ఎటువంటి కెమెరాలు చిక్కలేదు. చివరికి అనూహ్యరీతిలో బయటపడిన నిజం ఏమిటంటే వారి బెడ్ రూమ్ లో ఉన్నా స్మార్ట్ టీవీ నే ఈ కొత్త జంట యొక్క మొదటి రాత్రి వీడియో ని తీసింది అని. స్మార్ట్ టీవీకి వైఫై కనెక్షన్ ఉండడంతో దాన్ని హ్యాక్ చేసిన దుండగులు స్మార్ట్ టీవీకి ఉండే ఇన్ బిల్ట్ కెమెరాతో రికార్డ్ చేసి వెబ్ సైట్లో పెట్టేశారు. చివరికి ఇది కొంత మంది విదేశీయులు చేసిన పని పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకుని నిర్ఘాంతపోవడం కొత్తజంట వంతయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: