ఒక‌ప్పుడు పిల్ల‌లు గేమ్స్ అంటే ఆరుబ‌య‌ట ఆడుకోవ‌డ‌మో లేదంటే ఏద‌న్నా మంచి గ్రౌండ్‌కి వెళ్ళి ఆడ‌డ‌మో ఉండేది. వాటిలో క్రికెట్‌, ఫుట్‌బాల్‌, క‌బ‌డీ లాంటి మంచి ఎక్స‌ర్‌సైజ్ గేమ్స్ ఉండేవి. ఇక టెక్నాల‌జీ పెరిగే కొద్ది పిల్ల‌ల ఆట‌పాట‌ల్లో  కూడా చాలా మార్పులు వ‌చ్చాయి. వాటిలో పిల్ల‌ల పై అవి కొన్ని పాజిటివ్ ప్ర‌భావాలు చూపితే.. మ‌రికొన్ని నెగిటివ్ ప్ర‌భావాలు చూపుతాయి. 

 

ఇక ఆన్‌లైన్ గేమ్స్‌, బెట్టింగ్‌లు ఇవ‌న్నీ ప్ర‌స్తుతం చాలా స‌ర్వ సాదార‌ణంగా మారాయి. ఈ బెట్టింగుల వ‌ల్ల పిల్ల‌ల భ‌విష్య‌త్తు నాశ‌నం అవుతోంది. ఇలాంటి బెట్టింగ్ ప‌ద్ధ‌తి క్రికెట్ ఎప్పుడైతే బిజినెస్‌గా మారిందో అప్ప‌టి నుండి త‌యార‌యింది. ప్ర‌స్తుతం యువ‌త దీని పై మ‌క్కువ ఎక్కువ చూపుతున్నారు. దాని వ‌ల్ల వాళ్ళ చ‌దువు ఇంకా ఇత‌ర‌త్రా విష‌యాల పైన కూడా తీవ్ర న‌ష్టాన్ని చూపుతోంది. కాని చాలా మంది దీని పై స‌రైన అవ‌గాహ‌న‌ను పెంచుకోవ‌డంలేదు. 

 

ఈ బెట్టింగ్‌ల వ్య‌వ‌హారం ఒక్క సిటీస్‌లోనేకాక చిన్న చిన్న ప‌ట్ట‌ణాల‌లో కూడా మొద‌ల‌య్యాయి. ప‌ల్లె ప్రాంతాల‌కి కూడా ఈ బెట్టింగ్ వైఖ‌రి ఎక్కువ‌యింద‌నే చెప్పాలి. 2007లో ఐపీఎల్ మొదలైనప్పటి నుండీ దీని ప్రభావం మరింతగా పెరిగింది.  మొద‌ట్లో ఇదంతా గుట్టు ర‌ట్టుకాకుండా చాలా ర‌హ‌స్యంగా జ‌రిగేది.  బెట్టింగ్ అలవాటుగా, అడిక్షన్ గా మారిపోతోంది. ఆన్ లైన్ బెట్టింగ్ సైట్ లు ఎన్నో ఉన్నప్పటికీ, ఇండియాలో ఆఫ్ లైన్ బెట్టింగ్ జోరే ఎక్కువగా ఉంది. లోకల్ బుకీల ద్వారానే ఎక్కువగా గ్యాబ్లింగ్ నడుస్తోంది. తొలిదశలోనే దీన్ని తల్లిదండ్రులు గమనిస్తే ఆ వ్యసనం నుంచి పిల్లల్ని కాపాడుకోవచ్చు.

 

ఇక మ‌న‌దేశంలో ఇలాంటి బెట్టింగ్‌ల‌న్నీకూడా లీగ‌ల్‌గా ఉండ‌వు అన్ అఫీషియ‌ల్‌గా వెళ్ళాల్సిందే కానీ ఇప్పుడు ఇలాంటివి అన్నీచాలా స‌ర్వ సాధార‌ణంగా మారిపోయాయి. వీటినుంచి పిల్ల‌లు డైవ‌ర్ట్ అయ్యేలా త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌ల్సిందే. ఇలాంటి విష‌యాలు త‌ల్లిదండ్రుల‌కి తెలిసినప్పుడు ఏమాత్రం భ‌య‌ప‌డ‌కుండా అలాగే పిల్ల‌ల‌ను కోప్ప‌డ‌కుండా దాని వ‌ల్ల జ‌రిగే న‌ష్టాల గురించి వారికి అర్ధ‌మ‌య్యేలా వివ‌రించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: