హైదరాబాద్ లో యువత పెడదారులు తొక్కుతున్నది. జల్సాలకు అలవాటు పడిన యువత విందులు, వినోదాలతో పాటు సెక్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పబ్బుల్లో మద్యం తాగుతూ చిందులు వేస్తున్నారు. రాత్రంతా పబ్బుల్లో గడుపుతూ అమ్మాయిలతో సెక్స్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అమ్మాయిలు కూడా సెక్స్ కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో పబ్ కల్చర్ బాగా పెరిగింది. రాత్రంతా అక్కడ గడిపే అవకాశముండడంతో యువతకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చీకటి పడితే చాలు హైదరాబాద్ లోని కొన్ని పార్కులను సెక్స్ చేసుకునేందుకు కేంద్రాలుగా వాడుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కుటుంబ వ్యవస్థ ధ్వంసమయ్యే ప్రమాదముందని మానసిక వైద్యులు చెబుతున్నారు. 


ఇదిలా ఉండగా హైదరాబాద్ లో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఏదో రకంగా డబ్బులు సంపాదించేందుకు వీలుంది. ఏ విధంగా డబ్బులు సంపాదిస్తున్నారో అదే పద్దతిలో జల్సాలకు ఖర్చు కూడా చేస్తున్నట్లు తెలిసింది. పైగా క్రేడిట్ కార్డులను పొందడం చాలా సులువైంది. పెట్రోల్ బంకుల్లోనూ క్రెడిట్ కార్డులను ఇచ్చేందుకు అయా బ్యాంకుల ఎగ్జిక్యూటివ్ లు లైన్ లో నిలబడుతున్నారు. దీంతో రుణాలు తీసుకోవడం కూడా చాలా సులభమైంది.  రుణాలు అధికంగా తీసుకుంటున్న వారిలో హైదరాబాద్ యువత రెండో స్థానంలో ఉంది. తొలిస్థానంలో బెంగళూరు ఉందని రుణాలిచ్చే సంస్థ ‘క్యాష్ ఈ’తన నివేదికలో వెల్లడించింది.

 

వైద్య ఖర్చులు, ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్లకు యువత ఎక్కువ రుణాలు తీసుకుంటున్నారని తెలిపింది. తమ యాప్‌పై రుణాలు పొందుతున్న మహిళలు 10 శాతం మాత్రమే ఉన్నారంది. మొత్తం రుణాల్లో 31 నుంచి 38 ఏళ్ల మద్య ఉన్న యువత వాటా 52 శాతంగా ఉందని చెప్పింది. అధిక రుణాలు తీసుకుంటున్న నగరాల్లో గత సంవత్సరం ముంబై మొదటి ప్లేస్‌లో ఉంది. కానీ, ఈ సంవత్సరం మాత్రం బెంగుళూరు.. ముంబైని కాదని మొదటి ప్లేస్‌ను ఆక్రమించింది. హోమ్ లోన్, పర్సనల్ లోన్లు ఎక్కువగా తీసుకుంటున్న వారిలో బెంగుళూరు తర్వాత హైదరాబాద్ నిలిచింది. హైదరాబాద్ యువతలో 25 వేల నుంచి 50 వేల మధ్య సంపాదించేవారు ఈ లోన్ల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని తెలిపింది. ఈ లోన్లను ఆరు నుంచి నెలల్లో వాయిదా పద్దతుల్లో చెల్లించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: