జనవరి నెల వచ్చిందంటే చలితో వణికిపోతాం. దుప్పుట్లు కప్పుకుని వెచ్చగా పడుకోవాలనుకుంటాం. మరి మనకే ఇలా ఉంటే ధ్రువాల్లో పరిస్థితి ఏంటి.. ఇక దుప్పట్లు గిప్పట్లూలేని జంతువుల పరిస్థితి ఏంటి. అందుకే వాటికి ప్రకృతే తగిన రక్షణ కల్పిస్తోంది.

 

చలి నుంచి తట్టుకునేందుకు ధృవపు ఎలుగుబంట్లు, అమెరికన్, ఆసియాటిక్ ఎలుగుబంట్లు నిద్రను ఆశ్రయిస్తాయి. చలికాలంలో గాఢనిద్రలోకి జారుకుంటాయి. అత్యవసరమైతే మాత్రం వెంటనే మెలకువలోకి వచ్చేస్తాయి. దీర్ఘనిద్రలోకి పోయే కొద్ది రోజుల ముందు నుంచి విపరీతంగా ఆహారాన్ని తీసుకుంటాయి.

 

ఎంతగా తింటాయంటే.. రోజుకు ఏకంగా 20వేల కెలోరీల శక్తిని సంపాదిస్తాయి. ఒక వారంలోనే దాదాపు 13కిలోల బరువు పెరుగుతాయి. తర్వాత ఆ శక్తినంతా కొవ్వురూపంలో మార్చుకుంటాయి. ఇక మంచి సురక్షిత ప్రాంతం చూసుకుని పడకేస్తాయి.

 

గాఢ నిద్రలోకి వెళ్లగానే ఎలుగుబంటి గుండె కొట్టుకొనే వేగం నిముషానికి 10 నుంచి 8సార్లకు పడిపోతుంది. మాములుగా ఈ వేగం 80 నుంచి 90 వరకు ఉంటుంది. 5 నుంచి ఆరునెలల వరకు దీర్ఘనిద్రలో ఉండగలవు. ఈ సమయంలో అకస్మాత్తుగా మెలకువ వచ్చినా.. నిద్రాభంగం అయినా సరే.. వీటికి చావు తప్పదట. ఇదీ ప్రకృతి వింత. పాపం.. కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: