ఒక‌ప్పుడు పిల్ల‌లు స్కూలు నుంచి రాగానే చ‌క్క‌గా ఆరుబ‌య‌ట ఆడుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ఆట‌లు లేవు ఆ పాట‌లు లేవు ఎంత సేపు టీవీలు, వీడియో గేమ్స్ అంటూ వాటితోనే కాలాన్ని వెళ్ళ‌దీస్తున్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఈ త‌రం పిల్ల‌ల‌కు బ‌య‌ట ఆడుకునే ఆట‌లు చాలా వ‌ర‌కు తెలియ‌వ‌నే చెప్పాలి. ముఖ్యంగా 80- 90ల కాలం నాటికి చెందిన కొన్ని ఆట‌ల పేర్లు అడిగితే.. వీరు అస్స‌లు వాటి గురించి విని కూడా ఉండ‌రు. గ్రామీణ నేప‌థ్యంలో పెరిగే పిల్ల‌ల విష‌యంలో ఈ క్రీడ‌ల ప‌రిజ్ఞానం కాస్త ఉంటున్నా.. న‌గ‌రాల్లో పెరిగే పిల్ల‌లు మాత్రం బాల్యంలో క్రీడ‌లపై ఆసక్తిని కోల్పోతున్నారంటే అతిశ‌యోక్తి కాదు. ఇందుకు దోహ‌దం చేసే కార‌ణాలు చాలానే ఉన్నాయి. 

 

పెరుగుతున్న టెక్నాల‌జీ వినియోగం, పిల్ల‌ల‌ను క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకొనే దిశగా ప్రోత్స‌హించే తీరిక‌, ఓపిక త‌ల్లిదండ్రుల‌కు లేక‌పోవ‌డం.. వంటివి ఓవైపు కార‌ణాలైతే; ఆడుకోవాల‌ని అనిపించినా ప్లే గ్రౌండ్ (Play ground), ఓపెన్ ప్లేస్ లేక‌పోవ‌డం వ‌ల్ల కూడా కొంద‌రు పిల్ల‌లు ఈ ఆట‌ల‌కు దూర‌మ‌వుతున్నారు. క‌నీసం స్కూల్లో అయినా ఆడుకుందామంటే ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయో మ‌న‌కు తెలియ‌ంది కాదు.

 

పిల్ల‌లు బ‌య‌ట‌కు వెళ్లి ఆడుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలుసుకుంటే.. మనం వారిని ఆ దిశగా ప్రోత్సహించకుండా ఎంత తప్పు చేస్తున్నామో అర్థమవుతుంది. చిన్నారులు బ‌య‌ట‌కు వెళ్లి ఇత‌ర పిల్ల‌ల‌తో క‌లిసి ఆట‌లాడుకోవ‌డం ద్వారా వారి మ‌ధ్య ఐక్య‌త‌, స్నేహం వంటివి పెంపొంద‌డ‌మే కాదు.. శారీర‌కంగానూ వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. 

 

 కుర్చీలాట, గన్నాల ఆట లేదా గచ్చకాయలు,  కబడ్డీ, వామన గుంతలాట, నాలుగు స్థంబాల ఆట, వైకుంఠపాళి, తొక్కుడు బిళ్ల, తాడు బొంగరం లేదా బొంగరం, ఆరు బయట ఉయ్యాల ఊగుతూ ఆడుకోవడం, స్టాచ్యూ ఆట, గోలీలాట, దొంగా - పోలీస్ ఆట,  కళ్ల గంతలాట, దాగుడు మూతలాట
 ఖో-ఖో, గిల్లీ - దండ, ఏడు పెంకులు ఆట.

మరింత సమాచారం తెలుసుకోండి: