అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని.. ఏది జరిగినా మన మంచికే అనుకుని ముందుకు సాగడమే మంచి పని..అని అంటుంటారు. అవును జీవితంలో ఏదీ చెప్పిరాదు. శుభమైనా.. అశుభమైనా.. శుభం ఎలా వచ్చినా పర్వాలేదు. దాన్ని ఎదుర్కోవడానికి మనకు సంసిద్ధత అవసరం లేదు. కానీ అశుభానికి మాత్రం మనం ఎప్పుడూ సిద్ధపడే ఉండాలి.

 

మీరు ఒంటరి అయినా.. మీపై ఓ కుటుంబం ఆధారపడి ఉన్నా సరే.. మీరు చేయాల్సింది ఓ అత్యవసర నిధిని సమకూర్చుకోవడం. కొందరికి ఎంత జీతం వచ్చినా.. 15వ తారీఖు దాటిందంటే చిన్న ఖర్చుకు కూడా జేబులు వెదుక్కుంటారు. అంటే వీరిదగ్గర డబ్బు ఉంటుంది. కానీ ఎక్కువ కాలం నిల్వ ఉండదు. మరి అత్యవసరాలు చెప్పిరావు కదా. అప్పుడే ఇబ్బంది పడతారు.

 

అందుకే జీతం ఎంత వచ్చినా సరే.. ముందు అత్యవసర నిధి ఏర్పాటు చేసుకున్న తర్వాతనే మిగిలిన ఖర్చులకు డబ్బు కేటాయించుకోవాలి. అత్యవసరమైతే తప్ప ఈ నిధి జోలికి వెళ్లకూడదు. ఒక్కసారి ఈ నిధి సమకూరిన తర్వాత.. దీంట్లో నుంచి డబ్బు తీయకూడదు. ఇలాంటి ఏర్పాటు చేసుకుంటే.. ఎమర్జెన్సీ వేళ్లలో వాళ్లనీ వీళ్ళనీ కాళ్లుపట్టుకునే పని ఉండదు. ఈ ప్లానింగ్ ప్రతి ఒక్కరికీ అవసరం సుమా.

మరింత సమాచారం తెలుసుకోండి: