స‌హ‌జంగా ఆఫీస్ అంటే ఏం ఉంటుంది? ఆఫీస్​ టేబుల్, కుర్చీ, ద‌గ్గ‌ర‌ల్లో ఫర్నిచర్, ఫైల్స్ గ‌ట్రా... అయితే, ఇవ‌న్నీ మీపై ఎంతో ఒత్తిడిని పెంచుతున్నాయి. అలా అని వాటికి దూరం కాలేము క‌దా అంటారా?  వాటికి దూరం కాకండి.. ఒత్తిడిని దూరం చేసుకోండి.  ఒత్తిడిని చిత్తు చేయాలంటే ఏం చేయాలో తెలుసా?  చిన్న ఇండోర్​ ప్లాంట్​ను ఆఫీస్​ టేబుల్​ మీద పెట్టుకోవాలి. ఆఫీస్​ రూమ్​లోని కార్బన్​డయాక్సైడ్​నే కాదు.. మనలోని ఒత్తిడిని కూడా ఆ చిన్న మొక్క పీల్చేసుకుంటుందట. జపాన్‌‌లోని హ్యోగో యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు రీసెర్చ్​ చేసి సైంటిఫిక్​గా రుజువుచేసిన నిజం ఇది.

 

ఆఫీసు​తోపాటు చైర్​లో కూర్చోగానే ఇబ్బంది పెట్టే ప్రతి సమస్యా మన ఒత్తిడిని పెంచేదే. ఆ ఒత్తిడి త‌గ్గించేందుకు మొక్క‌లు ఎలా ఉప‌యోగ‌ప‌డ‌తాయో అధ్య‌యనం చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు వారు. కొన్నిరకాల ఇండోర్ ప్లాంట్స్ మానసిక ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంచడానికి ఎలా ఉపయోగపడతాయనే విషయమై “మసాహిరో టయోడా” పేరుతో ఫిజికల్​, మెంటల్​ హెల్త్​పై ఇండోర్​ ప్లాంట్స్ ఎలా ప్రభావం చూపుతాయనే విషయమై స్టడీ చేశారు. ఈ స్టడీ రిపోర్ట్​ను హార్ట్​ టెక్నాలజీ జర్నల్​ ఇటీవలే ప్రచురించింది. అధ్య‌నంలో భాగంగా, జపాన్​లోని 63 ఆఫీసుల్లో ఈ ఇండోర్ ప్లాంట్స్ ఉంచి పరిశోధనలు చేశారు. ఉద్యోగుల డెస్క్‌‌ల మీద  మొక్కలను పెట్టడానికి ముందు, పెట్టిన తర్వాత మానసిక, శారీరక ఒత్తిళ్లలో  కనిపించిన మార్పులను రికార్డు చేశారు.  ఈ రీసెర్చ్‌‌లో పాల్గొన్న వారికి అలసటగా అనిపించినప్పుడు వారి డెస్క్‌‌ల మీద ఉంచిన ప్లాంట్స్ చూస్తూ కనీసం 3 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. కావాలనే కాకుండా అనుకోకుండానే ఉద్యోగుల దృష్టి చాలాసార్లు తాము పెంచుకుంటున్న మొక్కలపై పడడాన్ని పరిశోధకులు గుర్తించారు. అంటే స్క్రీన్​ చూసే టైం కొంత తగ్గింది. ఇది కూడా ఒత్తిడిని తగ్గించడానికి కారణమైంది. 

 

ఉద్యోగుల మానసిక ఒత్తిడిని స్టేట్-ట్రెయిట్ యాంగ్జయిటీ ఇన్వెంటరీని ఉపయోగించి లెక్కకట్టారు. ఈ రీసెర్చ్‌‌లో పాల్గొన్న వారిలో డెస్క్ ప్లాంట్స్ పెట్టుకొని, 3 నిమిషాల విశ్రాంతిని పాటించాక ఈ ఒత్తిడి గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం, స్క్రీన్ చూడడం వంటివి తెలియకుండానే మనలో ఒత్తిడిని, ఆందోళనలను పెంచుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇవి జీవక్రియల మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దీనివల్ల హార్మోన్స్‌‌ బ్యాలెన్స్​ దెబ్బతింటుంది. కాబ‌ట్టి  ఆ స‌మ‌స్య‌లు రాకుండా...ప‌ర్యావ‌ర‌ణానికి కంటికి ఆహ్లాదం క‌లిగించే ఈ ఇండోర్ ప్లాంట్స్‌ను మీ క‌ళ్ల ముందు ఉంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: