సమాజంలో రోజురోజుకు విలువలు పడిపోతున్నాయి. అంతా డబ్బు వెంట పరుగెడుతున్నారు. తొక్కలో డబ్బు ఎవరికి కావాలంటే.. ఇవాళ ఉంటుంది.. రేపు పోతుంది. డబ్బు శాశ్వతమా చెప్పండి.. ప్రేమలు శాశ్వతం, మమతలు శాశ్వతం.. ఇలాంటి డైలాగులు వినడానికి బాగానే ఉంటాయి. కానీ ప్రాక్టికాలిటీలో మాత్రం ఏమాత్రం పనికిరావు.

 

డబ్బు పాపిష్టిది.. ఇది మనుషుల్ని చెడగొడుతుంది. మనుషుల మధ్య గొడవలు పెడుతుంది. అన్న దమ్ముల మధ్య కూడా విబేధాలు సృష్టిస్తుంది.. ఇలాంటి డైలాగులు కూడా బాగా వినబడుతుంటాయి. అయితే ఇవన్నీ నిజం అనుకుని.. ఇలాంటి వాతావరణంలో పెరగడం అసలు మనం చేసే తప్పు.

 

ఎందుకంటే.. డబ్బుకు మనసు లేదు. తప్పు మనలో ఉంది. డబ్బులో కాదు. డబ్బుతో ఈ ప్రపంచంలో చాలా మంచి పనులు చేయొచ్చు. అందుకే డబ్బును ఎప్పుడూ చులకన భావంతో చూడకండి. అలాగే డబ్బును వృథా చేయకండి. డబ్బును సద్వినియోగం చేయండి. తప్పు డబ్బులో లేదు.. తప్పు మనసుతో ఆలోచించే మనలోనే ఉంది. కాదంటారా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: