ఎవడి లైఫుకు వాడే హీరో.. అని ఓ సినిమా డైలాగు ఉంది. అలాగే.. ఎవరికి వారు నేనో పెద్ద పుడింగిని అని అనుకోవడంలో తప్పేమీ లేదు. అలా అనుకోవాలి కూడా. ఆ మాత్రం కాన్ఫిడెన్సు లేకుండా జీవితంలో ముందుకు వెళ్లలేం. అయితే ఆ విశ్వాసం మరీ ఓవర్ కాన్ఫిడెన్సు కాకూడదు సుమా.

 

ఎందుకంటే.. మీరెంత పుడింగి అయినా ఎప్పుడో ఓసారి పక్కడో సాయం అవసరం అవుతుంది. మీకంటే చాలా అల్పుడి సాయం కూడా మీకు ఒక్కోసారి తప్పకపోవచ్చు. అలాంటి సమయాల్లో భేషజాలకు పోకూడదు. అసలు చెప్పాలంటే.. ప్రతివారికీ ఎప్పుడో ఒకప్పుడు ఇతరుల సహాయం తప్పక అవసరం అవుతుంది.

 

అందుకే కదా.. అధికారులు సహాయకులను నియమించుకుంటారు. విజ్ఞులైన సహాయకుల వల్లనే అధికారికి మంచి పేరు వస్తుంది. మహాత్ములెందరో సామాన్యుల తోడ్పాటుతోనే విజయం సాధించారు. ఇందుకు చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందరికీ తెలిసిన రామాయణాన్నే తీసుకుంటే.. శ్రీరామచంద్రుడిని నది దాటించేందుకు గుహుడు సాయపడ్డాడు. రాముడు వానర సైన్యం సాయంతోనే రావణుడిని చంపాడు.

 

లక్ష్మణుడిని బతికించడానికి ఔషధమూలిక కోసం ఆంజనేయుడు ఒక పర్వతాన్ని పెకలించుకొని వచ్చాడు. అంతే కాదు. రాముడు ఎంత గొప్పవాడికైనా ఆఖరికి ఉడత సాయం కూడా అవసరం అయ్యింది కదా. అందుకే మీరు ఎంత పుడింగి అయినా ఇతరుల సాయం అడగడం తప్పేమీ కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: