చిన్నపిల్లలకు "దిష్టి" తగులుతుందా, లేదా అనే విషయంలో పలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, చాలా ఇళ్లల్లో ఇప్పటికీ చిన్న పిల్లలకు దిష్టి తీస్తుంటారు. అందులో ప‌సి పిల్ల‌ల‌కు ఖ‌చ్చితంగా రోజూ దిష్టి తీయాలంటున్నారు మ‌న పెద్ద‌వారు. అయితే, దిష్టి ఎలా పడితే అలా తీయకూడదనీ, దిష్టి తీసే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. చిన్నారులకు దిష్టి తీసేటపుడుఎ వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదు. 

 

పిల్లలకు తలంటు స్నానం చేయించిన తర్వాత, కర్పూరం బిళ్ల వెలిగించి పై నుంచి క్రిందికి తిప్పి, కర్పూరం వెలుగుతూ ఉండగానే బయట పడవేయాలి. ముఖ్యంగా ఇంట్లోని పెద్దవాళ్లు బయట ఎక్కడెక్కడో తిరిగి వచ్చినప్పుడు ఇంట్లోని చిన్న పిల్లలకు తాకకూడదు. వాళ్లు కాళ్లూ చేతులను శుభ్రంగా కడుక్కున్న తరువాతనే పిల్లలను ఎత్తుకోవాలి. అదే విధంగా అర్థరాత్రుల్లోనూ, మిట్ట మధ్యాహ్నం సమయాల్లోనూ పిల్లలను బయట తిప్పకూడదు.

 

రాతి ఉప్పును ఒక చెంచాడు చొప్పున ఎడం చేతి గుప్పిటలో తీసుకుని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి. చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేటులో పెట్టి పైవిధంగా మరో రెండుసార్లు చేసి నీటితో బిడ్డ కళ్లను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి. 

 

ఇదేవిధంగా ఉప్పు, మిరపకాయలు కలిపిన మిశ్రమంతో తీయవచ్చు. ఇంకా కొబ్బరి కాయను కూడా దిష్టి తీయడానికి వాడవచ్చు. అలాగే ఒక్కోసారి ఫంక్ష‌న్ల‌కు బ‌య‌ట‌కు వెళ్ళొచ్చిన‌ప్పుడు పిల్లలు ఎక్కువ‌గా ఏడుస్తుంటారు. అలాంటి స‌మ‌యాల్లో దిష్టి త‌గిలింద‌ని పెద్ద‌లు భావిస్తారు అప్పుడు ఖ‌చ్చితంగా దిష్టే బ‌య‌ట ఎవ‌రు ఎలా ఉంటారో తెలియ‌దు. కొంత మంది అశుభ్రంగా కూడా ఉండ‌వ‌చ్చు దాంతో పిల్ల‌ల‌కు ఇన్‌ఫెక్ష‌న్ లాంటిది అయి కూడా ఏడుస్తుంటారు. అలాంటి స‌మ‌యాల్లో బ‌య‌ట నుంచి రాగానే వేడి వేడి నీళ్ళ‌తో చ‌క్క‌గా స్నానం చేయించి ప‌డుకోబెట్టాలి. అంతేకాక ఎక్కువ‌గా ఏడ్చిన‌ప్పుడు ఒక కాట‌న్ బ‌ట్ట‌ను తీసుకుని దాన్ని నూనెలో ముంచి మూడు సార్లు బిడ్డ చుట్టూ తిప్పి అప్పుడు మంట‌తో దాన్ని కాల్చి దిష్టి తీయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: