సూక్ష్మ కళాకారులు సందర్భం వస్తే చాలు తమలోని కళానైపుణ్యం, సృజనాత్మతకను ప్రపంచానికి చూపిస్తున్నారు. వారి కళ ఎంత అద్భుతం అనేది కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త పేటకు చెందిన పెద్దింటి కృష్ణ వంశి బియ్యపు గింజపై జాతీయ జెండాను చెక్కి తన దేశభక్తిని చాటు కున్నాడు. 

 

గతంలోను పెద్దింటి కృష్ణ వంశి చింత కుంతలపై.. గోదావరి చరిత్రను... సబ్బులపై గాంధీ, వినాయకుడు, గౌతమ్ బుద్ధుడి రూపాలను చాలా చక్కగా చెక్కి వంశి ఎంతోమందితో ప్రశంసలు అందుకున్నాడు. కాగా ఎందరో కళాకారులూ గతంలోను ఇలానే వారి కళను ప్రపంచానికి చూపించారు.  

 

గతంలోను బియ్యపు గింజపై జాతీయ పతాకంను చెక్కారు కొందరు కళాకారులు. విశాఖపట్నం జిల్లా ఉద్దండపురం గ్రామానికి చెందిన యువకుడు పొడగట్ల వివేక్‌ బియ్యపు గింజపై మువ్వన్నెల పతాకాన్ని చెక్కి, దానికి రంగులు అద్ది, పెన్సిల్‌ ముల్లు చివరన అతికించాడు. ఓ వేడుక కోసం అద్భుతాన్ని బియ్యపు గింజపై సృష్టించాడు. 

 

మూడు గంటల పాటు శ్రమించి 1.5 మిల్లీమీటరు వెడల్పు, 2 మి.మీ ఎత్తులో జెండాను రూపొందించాడు. అదేవిధంగా మరో పెన్సిల్‌ ముల్లుపై 5 మి.మీ ఎత్తు, 2మి.మీ వెడల్పున మరో జాతీయ పతాకాన్ని తయారుచేశాడు. దీంతో అప్పట్లో ఈ కళ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: