జీవితంలో మనం కొన్ని మాత్రమే ఎంచుకోగలం.. కొన్నింటి విషయాల్లో చాయిస్ ఉండదు. యాక్సెప్ట్ చేస్తూ పోవాలంటే.. ఉదాహరణకు మనం ఏ ఇంట్లో పుట్టాలో మనం డిసైడ్ చేయలేం. మనం ఎవరికి పుట్టాలో మనం డిసైడ్ చేయలేం. మనం ఏ కులంలో పుట్టాలో, ఏ ప్రాంతంలో పుట్టాలో మనం డిసైడ్ చేయలేం.

 

అలాగే మన అక్కా చెల్లీ, తమ్ముడు, అన్నయ్య.. వీళ్లను మనం డిసైడ్ చేయలేం. యాక్సెప్ట్ చేయాలంటే.. కానీ కొన్ని బంధాలు మనం ఎంచుకోగలం.. మన భార్య, మన స్నేహితుడు, మన గురువు, మన శిక్షకుడు ఇలాంటివి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైంది స్నేహం.

 

అరమరకలు లేని స్నేహితుడు దొరకడం చాలా అదృష్టం. భగవంతుడు జీవితంలో కొన్ని ఉదారం గా ఇచ్చేస్తాడు.. ఇంకొన్ని మనం సంపాదించుకోవాలి. స్నేహం విషయంలోనూ అంతే.. బాల్య స్నేహితులు ఎప్పటికీ మరిచిపోలేం.

 

అలాగే జీవితంలో తారస పడే మంచి వ్యక్తులన్ని స్నేహితులుగా మలచుకోండి. మీ జీవితం సాఫీగా సాగిపోతుంది. అలాంటి ఒక్క స్నేహితుడు కూడా ఇప్పటి వరకూ మీకు తారస పడలేదంటే మీలో లోపం ఉన్నట్టే.. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. జీవితంలో సమీక్ష చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: