ఇద్దరు యువకులు స్నానం చేసినందుకు  ట్రాఫిక్ పోలీసులు వెతికి మరీ పట్టుకుని భారీ ఫైన్ విధించిన సంఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అదేంటి ఇద్దరు యువకులు స్నానం చేస్తే ట్రాఫిక్ పోలీసులకి సంభంధం ఏమిటి..?? ఫైన్ ఎందుకు వేశారు..?? అసలు ఇద్దరు యువకులు స్నానం చేయడం ఏమిటి..?? అంటూ ఇలా రకరకాల ప్రశ్నలు బుర్రలో తిరుగుతున్నాయి కదూ.. నాన్చకుండా  అసలు విషయంలోకి వచ్చేస్తా..అసలేం  జరిగిందంటే...

 

దక్షిణ వియత్నంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. తాన్ ఖాన్ అనే ఓ వ్యక్తి , అతడి స్నేహితుడు ఇద్దరూ బండిపై చొక్కా విప్పేసి వెళ్తూ మధ్యలో ప్లాస్టిక్  బకెట్ పెట్టుకుని స్నానం చేస్తూ వీడియో తీయించుకున్నారు. బైక్ నడుపుతున్న వ్యక్తికి వెనుకాల కూర్చుని ఉన్న మరొక వ్యక్తి నీళ్ళు పోస్తుంటే అతడు సబ్బుతో రుద్దు కోవడం, వెనుకాల ఉన్న వ్యక్తి కూడా సబ్బుతో రుద్దుకుంటూ నీళ్ళు పోసుకున్నాడు. ఈ తతంగం అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు...

 

ఈ వీడియో కాస్తా వైరల్ అయ్యి పోలీసు దృష్టికి వెళ్ళింది. దాంతో ఈ వీడియోని నిశితంగా పరిశీలించిన పోలీసులు నెంబర్ ప్లేట్ ఆధారంగా వారిని కనుగొని హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు గాను మరియు బండిపై వెళ్తూ స్నానం చేస్తూ ట్రాఫిక్ రూల్స్ కి విరుద్దంగా ప్రవర్తించి మిగిలన వాహనదారులకి ఇబ్బంది కలిగించినందుకు గాను భారీ జరిమానా విధించారట. స్వేఛ్చ హద్దులు మీరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పడానికి ఇదొక నిదర్శనమనే చెప్పాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: