భారత దేశం అనేక రకాల భాషలు, మతాలూ, కులాలు, జాతులు, వర్ణాలు, వర్గాలు, సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు మరియు అనేక రకాల పద్ధ‌తులు కలిగిన ఏకైక దేశం మనది. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వ విద్యాలయాన్ని స్థాపించింది మన భారత దేశమే. అందుకు మనమందరం గర్వపడాలి. కాని నేటి మన దేశంలో విద్య ఏవిధంగా నడుస్తుందో మన అందరికి తెలుసు పిల్లలకు పూర్తిగా అన్యాయం జ‌రుగుతుంది. పెద్ద విద్యార్థుల సంగతి పక్కకు పెడితే పిల్లలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. సరిగా 5 సంవత్సరాలు నిండని పసి పిల్లలని పాఠ‌శాల అనే ఒక బందీ కానాలో చేర్చి అటు తల్లితండ్రులు మరియు ఉపాద్యాయులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. కనీస మానసిక ఎదుగుదల లేని పిల్లలని తమ ముక్కుపచ్చ‌లారని పిల్లలని తమ బాల్యంకు దూరం చేస్తున్నారు. దీని వల్ల పిల్లల మానసిక ఎదుగుదల కుంటుపడుతుందని చెప్పినా వాళ్ళు మాత్రం వాళ్ళ అవ‌స‌రాల కొర‌కు మానడం లేదు. అపురూపమైన, అందమైన బాల్యాన్ని అదిలోనే మొగ్గ ప్రాయం లోనే తొక్కిపడేస్తున్నారు. 

 

ఇదీ విద్యా వంతులు, మేధావులు, అందరు ఆలోచించే విషయం అయినా వారి ధోరణి వారిదే. ప్లే స్కూల్స్ లో, కిన్దర్ గార్డెన్ లో పిల్లలు సంతోషంగా గడుపుతారని వారి ఉద్దేశ్యం. కాని ఒక పిల్లవాడు తన కుటుంబంలో అన్ని సాంఘీక పరిపక్వతను, ప్రేమను, ఆనందాన్ని, చురుకుదన్నాన్ని, ఉత్సాహాన్ని మరియు ఉల్లాసాన్ని అన్నిటిని కోల్పోతున్నాడు. కాబట్టి అందరూ కొంచెం శ్రద్ద వహించి పిల్లవానికి తగిన వయస్సు రాగానే స్కూల్ కి పంపాలి. ఇది రానున్న తన భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అంద‌రూ భావిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రవర్తన మారాలి విద్యార్థుల కొరకు ఆలోచిస్తే ముందుగా సమాజంలోని తల్లిదండ్రుల ప్రవర్తన మరియు సమాజంలో చదువుకున్న వ్యక్తులు అవలంబించే విధానాలు, లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇతరుల పట్ల నడుచుకునే విధానం చాలా ముఖ్యమైనది. నైతిక ప్రవర్తన బాగుచెయ్యలేకపోతే వ్యవస్థ ఎప్పటికి బాగుపడదు. విపరీతమైన ఖర్చు తప్ప ప్రయోజనం ఉండదు. మార్పు కావలి, వృత్తి పరమైన నైపుణ్యాలు నేర్పించాలి.

 

బాల కార్మికులను బడిలో చేరిపించుటకు ఇప్పుడు అనుసరిస్తున్న చట్టాల వల్ల సరియైన స్పందన రావడము లేదు కావున మంచి వ్యవస్థను తయారుచేయుటకు సలహాలు ఇస్తూ బడికి పోవలసిన పిల్లలను పనిలో పెట్టుకొని వెట్టిచాకిరి చేయుంచుకుంటున్న వారిని కటినంగా శిక్షించిన దాకలాలు ఎక్కడ కనిపించడము లేదు. ఐతే శిక్షలు పడక పోవడము వలన పదే పదే వెట్టి చాకిరీ చేపించుకుంటున్నారు. కావున శిక్షలు అమలు అయ్యె విధముగా చట్టాలు కటినముగా తెస్తూ బాలకార్మికులను బడిలో చేర్పించుటకు ప్రతియొక్క పౌరుడు బాద్యత తీసుకొనుటకు సలహాలను ఇవ్వవలసిందిగా కోరుచున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి: