నేటి మంచిమాట.. ఎవరో మహానుభావుడు చెప్పిన అద్భుతమైన మాట ఇది.. ఆ మంచి మాట ఏంటి అంటే ''పది మందిని సంతోష పెట్టు కానీ ఒకరిని బాధపెట్టకు'' అనేది ఆ మాట. అయితే నిజానికి అంతేకదా .. కోర్టులో కూడా ఇదే చెప్తారు.. 100మంది దోషులను వదిలేసినా పర్లేదు కానీ ఒక్క నిర్దోషిని కూడా శిక్షించకూడదు అని.. 

 

కానీ నిజానికి.. అక్కడ నిరుద్ధోషులనే ఎక్కువ శిక్షిస్తారు. ఎందుకంటే దోషులు దొరకటానికి మన న్యాయస్థానాలకు సంవత్సరాలు సమయం పడుతుంది కాబట్టి.. సరే లెండి.. మనం ఇది వదిలేసి... ఈరోజు మంచి మాట గురించి డిస్కస్ చేద్దాం. నిజమే పది మంచిని సంతోష పెట్టు కానీ ఒకరిని బాధ పెట్టకు అని అంటారు మన పెద్దలు. 

 

కానీ ఆలా అందరిని సంతోష పెట్టడానికి మనం ఏమైనా లాఫింగ్ బుద్ధ నా ? కాదు కదా! మనిషి కదా ! సో ఖచ్చితంగా మనం అందరిని ఆనంద పెట్టలేం.. మనకు ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి. కానీ ఆ ఫీలింగ్స్ ని చంపేసి అయినా సరే మనం అందరిని ఆనంద పెట్టాలి తప్ప బాధ పెట్టకూడదు.. భాద పెడితే.. పదిమందిని సొంతోషం పెట్టిన నష్టమే.. అందుకే పది మందిని సంతోష పెట్టు కానీ ఒకరిని బాధపెట్టకు అని పెద్దలు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: