ఒక‌ప్పుడు ఐటీ కంపెనీల్లో ప‌నిచేసే వారంటే విప‌రీత‌మైన డిమాండ్ ఉండేది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులంటేనే జ‌నం తెగ ఎగ‌బ‌డి మ‌రి పిల్ల‌ను ఇచ్చేవారు. అలాంటిది ఇప్పుడు చాలా మంది భ‌య‌ప‌డుతున్నారు. అందుకు కార‌ణం లేక‌పోలేదు. అత్త‌మామ‌లు ఎంతో గ‌ర్వంగా మా అల్లుడు సాష్ట్ వేర్ ఇంజ‌నీర్ అంటే అదో స్టేటస్ సింబల్ఎం గా చెప్పేవారు. ఎందుకంటే.. లక్షల్లో జీతాలు, అప్పుడప్పుడు విదేశీ టూర్లు. పట్టుమని పాతికేళ్లు నిండకుండానే ఆరు అంకెల జీతం తీసుకున్న భారత దేశపు మొదటి తరం వారు.. అందుకే పిల్లను ఇవ్వటానికి ఆడపిల్ల తల్లిదండ్రులు పోటీ పడేవారు.

 

ఇప్పుడు సీన్ మారింది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోత.. తొలగింపుతో వారికీ పెళ్లి కష్టాలు వచ్చాయి. మ్యారేజ్‌ బ్యూరో లో అయితే.. ఐటీ ఎంప్లాయిని వద్దుంటున్నారని మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్స్ ఓపెన్ గానే చెప్పేస్తున్నాయి. ఎందుకంటే.. ఐటీ ఇండస్ట్రీ పై ఆటోమేషన్ తోపాటు.. అమెరికా కూడా స్థానికులకే అవకాశాలు అంటోంది. దీంతో ఐటీ ఉద్యోగుల డాలర్ డ్రీమ్స్ కరిగిపోయాయి. ఉన్న ఉద్యోగం ఉంటే చాలు అనే స్థాయికి వచ్చేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. దీంతో పెళ్లికి రెడీగా ఉన్న కుర్రోళ్లకు కష్టాలు మొదలయ్యాయి. 

 

ముఖ్యంగా పెద్దలు కుదిర్చే పెళ్ళి సంబంధాల్లో ఐటీకి డిమాండ్ బాగా తగ్గింద‌నే చెప్పాలి. అబ్బాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అంటే.. అమ్మాయి తల్లిదండ్రులు వెనకాడుతున్నారు. ఇప్పుడు ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియదు కాబట్టి.. పిల్లను ఎలా ఇస్తాం అంటూ వెనుకడుగు వేస్తున్నారు. ఇక సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్లు కు పెళ్ళికి పిల్ల దొర‌క‌డం క‌ష్ట‌మేన‌నమాట‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: