పిల్లల పెంపకం కూడా ఓ కళ. చాలామందికి ఈ విషయమే పట్టదు. వాళ్లను మంచి స్కూళ్లో వేస్తున్నామా.. మంచి ట్యూషన్ చెప్పిస్తున్నామా.. ఫీజులు కడుతున్నామా.. ఇంత వరకే మా పని అన్నట్టుగా ఉంటారు. ఇక మిగిలిందంతా వాళ్ల టీచర్లు చూసుకోవాల్సిందే అనుకుంటారు.

 

కానీ అది సరికాదు.. ఎంత సేపూ.. పిల్లల మార్కులు, ర్యాంకుల గురించి కాకుండా ఇతర విషయాల గురించి మీరెప్పుడైనా మాట్లాడారా ? మీకు ఏది ఇష్టం.. మీ అభిరుచి ఏంటి అని పిల్లను ఎప్పుడైనా అడిగారా.. వారి ఇష్టాయిష్టాలేమిటో తెలుసుకున్నారా? అసలు వారికిష్టమైన కోర్సు చదవనిచ్చారా?

 

ఇది చాలా కీలకమైన ప్రశ్న. చదువుల పేరుతో లక్షలకు లక్షలు ఖర్చుచేస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన తీరులో ఆలోచించడం నేర్పిస్తున్నారా ? దాని కోసం రూపాయైనా ఖర్చు చేస్తున్నారా ? ఈ ప్రశ్నకు చాలా మంది వద్ద సమాధానమే ఉండదు. అందుకే ముందు పిల్లల ఇష్టాలు తెలుసుకోండి. వారికి అభిరుచి ఉన్న దారిలో వెళ్లనివ్వండి. అప్పుడే వారి జీవితం అద్భుతంగా ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: