అవును నిజమే.. మీరు చాలా చెడ్డ తండ్రి.. ఈ వ్యాసం చదివే వాళ్లలో నూటికి 90 శాతం మంది చెడ్డ తండ్రులే అంటే ఆశ్చర్యం లేదు. అదేంటి అలా అంటారు.. తమ పిల్లలు మంచి జీవితం గడపాలనేగా.. ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు.. మేము కూడా అంతే.. మా పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్నాం.

 

పిల్లల కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మంచి ఖరీదైన స్కూల్లో వేస్తున్నాం.. అంటారు. కానీ మంచి తండ్రి అంటే అంతేనా.. అసలు పిల్లల్ని ఎలా పెంచాలో మీకు తెలుసా? అందుకోసం కనీసం ఒక్క పుస్తకమైనా కొని చదివారా ? కనీసం.. ఒక్క వీడియో అయినా చూశారా? పోనీ.. ఎవరైనా పిల్లల నిపుణుడి వద్ద ఒక్క క్లాసయినా విన్నారా?

 

పోనీ.. అవసరానికి, ఆడంబరానికి మధ్య ఉన్న తేడా మీ పిల్లలకు తెలిసేలా చేశారా? సరదాకు, విచ్చలవిడితనానికి తేడా ఏమిటో వివరించారా? వారి జీవితానికి వారే బాధ్యులని ఎన్నడైనా చెప్పారా?

 

మరి ఇవేమీ నేర్పకుండా.. ఇవేమీ చెప్పకుండా.. వాళ్లకు తగినంత సమయం కేటాయించకుండా.. వారితో గడపకుండా.. వారి మనసులో మాటలు తెలుసుకోకుండా.. కేవలం మంచి స్కూళ్లోవేశాం.. డబ్బు కడుతున్నాం.. ఏం కావాలంటే అది కొనిస్తున్నాం అంటే.. మీరు మంచి తండ్రి అయిపోతారా.. ఒక్కసారి ఆలోచించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: