పిల్ల‌ల పేర్లు పెట్ట‌డానికి చాలా మంది పెద్ద‌వాళ్ళు ఎక్కువ క‌ష్ట‌ప‌డుతుంటారు. అందుకు మీకోసం కొన్ని టిప్స్ ఎలా పెట్టాలో చూడండి. ఓ మహిళ చీర కొనడానికి ఎంత ఆలోచిస్తుందో అందరికీ తెలుసు. దాని కలర్, ఎంబ్రాయిడరీ వర్క్, లుకింగ్.. ఇంకా అది లేటెస్ట్ ఫ్యాషన్ కు అనుగుణంగా ఉందా లేదా? ఇలాంటివి వంద ఆలోచిస్తారు. ఆ చీరను కట్టేది అమావాస్యకు ఓసారి అయినా... చీర కోసం మహిళలు పడే తపన అంతా ఇంతా కాదు. ఇలా.. ఓ చీర కోసం ఒకటికి వంద సార్లు ఆలోచించే మహిళలు.. తమ కన్నబిడ్డలకు పేరు పెట్టడానికి ఎంత ఆలోచించాలి. అది జస్ట్ పేరు మాత్రమే అయితే.. ఇన్ని పాట్ల పడాల్సిన అవసరం ఉండదు. కానీ…

 

గతంలో బిడ్డ పుట్టిన 21 రోజుల వరకు (కొంతమంది మూడు నెలల సమయం తీసుకుంటారు) బిడ్డ పేరు గురించి ఆలోచించేవాళ్లు కాదు. ఇక.. బిడ్డ పుట్టిన రోజు, సమయం వంటి వాటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత జాతకం చూసే పండితులు.. బిడ్డకు ఏ పేరు పెట్టాలో.. జాతకం ప్రకారం వచ్చే మొదటి అక్ష‌రాన్ని చెప్పేస్తాడు. ఇక.. అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు కథ.

 

కాని.. ఈ జనరేషన్ వేరు కదా. అందుకే.. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపాయికి పేర్లు పెట్టేస్తున్నారు కొందరు. ఇక.. మరికొందరు బుజ్జాయి పుట్టగానే పేరు పెట్టడం కోసం తెగ ఆయాస పడుతుంటారు. ఫ్యామిలీకి చెందిన బంధువులంతా మాంచి పేరు కోసం కుస్తీలు పడుతుంటారు. మరి.. ఈ జనరేషన్ కు అనుగుణంగా పెద్దయ్యాక పిల్లలు తల్లిదండ్రులను తిట్టుకోకుండా ఉండేలా పిల్లలకు సూటయ్యేలా పేరు ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: