ప్రపంచ వ్యాప్తంగా మీడియాకి  ఉన్న  ప్రాముఖ్యత అంతా యింతా కాదు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలని తలదన్నుతూ వెబ్ జర్నలిజం ప్రస్తుతం  దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తాజాగా చేరవేయడంలో ఈ వెబ్ జర్నలిస్ట్ ల పాత్ర క్రియాశీలకంగా మారింది. ప్రముఖ పత్రికలలో పనిచేస్తున్న ఎంతో మంది జర్నలిస్ట్ లు సైతం పార్ట్ టైం గా ఈ వెబ్ జర్నలిజం వైపు ఆశక్తి చూపుతున్నారు. అయితే ఈ క్రమంలోనే చాలా మంది వార్తల్లో తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం, ఫేక్ న్యూస్ ని ప్రజలకి చేరవేయడంతో ఎన్నో విపరీత పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితులని ఎదుర్కోవడానికే...

 

గూగుల్ ఇంటర్ న్యూస్ అనే స్వచ్చంద సంస్థకి సుమారు 7 కోట్ల రూపాయల నిధులని ఇస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 250  మంది సీనియర్ రిపోర్టర్స్ మరియు స్వచ్చంద సంస్థ కార్యకర్తలు, సమాజ సేవకులని ,విద్యావేత్తల్ని ఎంపిక చేసుకుంటుంది. వీరందరితో భారత దేశంలో అత్యంత బలమైన నెట్ వర్క్ రూపొందిస్తారు. అంతేకాదు ఎంపిక అయ్యి శిక్షణ తీసుకున్న వీరు భారత దేశంలో నకిలీ వార్తలని కట్టడి చేస్తారు.

 

ఈ క్రమంలోనే 300 లకి పైగా బూట్ క్యాంప్ లు , వర్క్ షాప్ లు ఏర్పాటు చేస్తారు. ఈ వర్క్ షాప్ లకి వచ్చే వారికి ఆన్లైన్ లో ప్రచురించ బడిన వార్తల స్వభావం, నకిలీనా కాదా అనే అవగాహన కల్పిస్తారు. గూగుల్ ఏర్పాటు చేసే ఈ ట్రైనింగ్ లో భారత్ లో విస్తరిస్తున్న వెబ్ జర్నలిజం లో వస్తున్న నకిలీ వార్తలని పసిగట్టి వాటిని ఏరివేయడమే ప్రధాన లక్ష్యమని  గూగుల్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: