ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ లక్ష్యాలను సాధించాలని కలలు కంటారు. కానీ కొందరు మాత్రమే ఆ లక్ష్యం కోసం కృషి చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కొందరు మాత్రం ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా నిర్లక్ష్యం, ఇతర కారణాల వలన లక్ష్యాన్ని సాధించడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఆ లక్ష్యానికే పూర్తిగా అంకితం కావాలి. 
 
లక్ష్యం సాధించటంలో ఎన్ని అవరోధాలు, ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేయకూడదు. జీవితంలో మనకంటూ ఒక లక్ష్యం ఉంటే తికమక పడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే మనకు సరైన లక్ష్యం లేదో అప్పుడు కాలాన్ని వృథా చేసుకుంటూ అనవసర విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ జీవితంలో ఏ పనిలోను విజయం సాధించలేకుండా ఉంటాం. లక్ష్యాన్ని సాధించాలనుకునేవారు మొదట ఆ లక్ష్యాన్ని ఎప్పటిలోపు సాధించాలనుకుంటున్నారో నిర్దేశించుకోవాలి. 
 
ఆ లక్ష్యం దిశగా ఆలోచనలు చేసి లక్ష్యాన్ని సాధించటానికి తగిన ప్రణాళికను రూపొందించుకోవాలి. ఆ తరువాత మన లక్ష్యాలను ఒక పేపర్ పై రాసుకొని ప్రతిరోజు లేచిన వెంటనే ఆ పేపర్ ను చదివి మన లక్ష్యాలను మనం గుర్తు చేసుకోవాలి. ప్రతిరోజు నిన్నటికీ ఈరోజుకు లక్ష్య సాధన దిశగా ఎంత కృషి చేశామని నిన్నటితో పోలిస్తే ఎంత మెరుగయ్యామనే విషయాలను గమనిస్తూ ఉండాలి. లక్ష్య సాధనలో బలహీనతలను అధిగమిస్తూ ముందడుగు వేయాలి. చివరిగా లక్ష్యాలుగా మార్చుకున్న మన కలలను నిజం చేసుకోవడానికి కృషి చేసి కన్న కలలను నిజం చేసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: