ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న అతిపెద్ద సమస్య కరోనా వైరస్. కరోనా ధాటికి ప్రజలు పిట్టలు రాలినట్టుగా రాలిపోతున్నారు. చినా లో మొదలైన ఈ వైరస్ అక్కడి నుంచీ ప్రపంచ దేశాలకి మెల్లగా పాకుతోంది. ఈ వైరస్ దెబ్బకి ఇప్పటికి 400 మందికి పైగా చనిపోయారని తెలుస్తోంది. ఈ వైరస్ కి మంది కనిపెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికే తీవ్రమైన నష్టం వాటిల్లడంతో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఈ వైరస్ మరిన్ని దేశాలకి విస్తరించడంతో ప్రపంచ దేశాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అసలు ఇలాంటి వైరస్ లు శరీరంలోకి ప్రవేశించకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?? ఎలాంటి ఆహారపు నియమాలు పాటించాలి..?? అనే విషయాలు తెలుసుకుందాం...

 

మనిషి యొక్క అసహజసిద్దమైన ఆహారపు అలవాట్లే  ప్రస్తుత వైరస్ ల విచ్చల విడి వ్యాప్తికి మూలం అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరి ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. పూర్వం మనిషి జీవన శైలి, ప్రస్తుతం మనిషి జీవన శైలి ని బేరీజు వేసుకుంటే అసలు వాస్తవం యిట్టె అర్థమవుతుంది. ఎంతో జాగ్రత్తగా ఉన్నా సరే ఎందుకు మనిషినే వైరస్ లు ఎందుకు పట్టి పీడిస్తున్నాయి. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తింటున్న జంతువులకి ఎందుకు వైరస్ సోకడం లేదు..అనే విషయాలు ప్రతీ ఒక్కరూ అర్ధం చేసుకోవాలి. పూర్వపు ఆహారపు అలావాట్ల ఇప్పుడు పాటిస్తే ఎలాంటి వైరస్ లు అయినా సరే మనిషి దరిదాపులకి చేరవు అంటున్నారు నిపుణులు.

 

ప్రస్తుతం మనం తినే ప్రతీ పదార్ధం ఫ్రయిడ్ అయ్యి వస్తోంది. ప్రతీది కాల్చుకుని, వేడి చేసి తినడమే శరీరానికి ప్రధానమైన శత్రువుగా మారుతున్నాయి. అలాంటి పదార్ధాలు తినడం వలనే  అధికశాతం మంది షుగర్, బీపీ, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బుల బారిన పడుతున్నారు. అయితే ఎటువంటి హానికరమైన  వైరస్ అయినా మనిషి శరీరానికి ప్రమాదంగా మారకుండా ఉండాలంటే..

 

మనం తినే ప్రతీ ఆహారాని వేయించి తినడం ముందుగా మానుకోవాలి. కూరగాయలని ఉడికించి తినడం వలన వాటిలో ఉండే ఆరోగ్యకరమైన విటమిన్లు శరీరాన్ని రక్షణ కవచంగా కాపాడుతాయి. పూర్వీకులు అన్నం తినే ముందు తప్పకుండా సొంటి పొడి , వాము పొడిని మొదటి రెండు ముద్దల్లో కలుపుకుని తింటారు. అంతేకాదు భారతదేశానికి ఎంతో అద్భుతమైన ఆరోగ్య ప్రదాయని అయిన పసుపుని ప్రస్తుత తరం విడిచి పెట్టడం కూడా వ్యాధుల ప్రభాలడానికి ప్రధానమైన కారణం. మనం తినే ఆహారంలో స్వచ్చమైన పసుపుని వాడటం వలన సగానికి సగం చెడు వైరస్ లు అంతం అయిపోతాయి. సూర్యుడికి దూరంగా బ్రతకడం వలన రోగ నిరోధక శక్తి తగ్గిపోతోంది. కాబట్టి ప్రతీ ఒక్కరూ సూర్యరశ్మిని పొందుతూ, సనాతన భారతీయ ఆహారపు అలవాట్లు పాటిస్తూ ఉంటే కరోనా కాదు కదా ఎలాంటి భయంకరమైన వైరస్ లు అయినా భారతీయుల దరి చేరనే చేరవు అంటున్నారు నిపుణులు.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: