చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అన్న సామెత విన్నారా.. ఏదైనా ముప్పు జరిగిపోయాక, నష్టం అనుభవంలోకి వచ్చాక సత్యం బోధపడుతుంది. కానీ అప్పటికే సమయం మించిపోయి ఉంటుంది. అప్పుడు ఆ సత్యం తెలిసి కూడా మనకు ఉపయోగం ఉండదు. కేవలం ఇతరులకు చెప్పడానికి తప్ప.

 

ఇదే పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే ముందే మేలుకోండి. మీ అనుభవాల నుంచే కాదు. పెద్దల మాటల నుంచి ఇతరుల అనుభవాల నుంచి కూడా నేర్చుకోండి. ఎందుకంటే.. మనం వృద్ధాప్యాన్ని సమీపించినప్పుడు చురుకుగా తయారవుతాం.. అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది.

 

100 రూపాయల గడియారమైనా, లక్ష రూపాయల గడియారమైనా.. ఒకే సమయాన్ని సూచిస్తుంది. జీవితంలోని కొన్ని దశల్లో మన జేబులో వెయ్యి రూపాయలున్నా.. , లక్ష రూపాయలున్నా అందులో తేడా ఏమీ వుండదు.

 

 

లక్ష రూపాయల కారైనా.. కోటి రూపాయల కారైనా.. ప్రయాణించే దూరం, బాట ఒకటే, చివరికి అదే గమ్యం. ఈ సత్యంపై అవగాహన ఉంటే.. ఆ తర్వాత జీవితం సులభం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: