ఈ మధ్య కాలంలో చాలామంది తాము పోటీ పరీక్షల కోసం చాలా కష్టపడ్డామని, ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమించామని కానీ ఎంత కష్టపడినా విజయం మాత్రం సాధించలేకపోయామని చెబుతున్నారు. తమకు అదృష్టం కలిసిరాలేదని, రానిదానికోసం ఎందుకు కష్టపడటం అని ఆలోచిస్తూ నిరాశతో, బాధతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ జీవితంలో విజయం సాధించలేకపోయామంటే ఎందుకు సాధించలేకపోయామని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ మనల్ని మనం అర్థం చేసుకోవాలి. 
 
అంత కష్టపడినా విజయం రాలేదంటే మనల్ని మనం అర్థం చేసుకొని ఎక్కడ సమయం వృథా అయిందో విజయం సాధించటానికి ఉపయోగపడే బలాలేంటో, బలహీనతలేంటో గుర్తించాలి. ఇప్పుడు ఓడిపోయినా భవిష్యత్తులో గెలవాలంటే ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచించాలి. మనల్ని మనం నమ్ముతూ వేసుకున్న ప్రణాళికను క్రమం తప్పకుండా పాటిస్తూ లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. 
 
మనల్ని మనమే అర్థం చేసుకోలేకపోతే, మనపై మనకే నమ్మకం లేకపోతే విజయం సాధించటం ఎట్టి పరిస్థితులలోను సాధ్యం కాదు. ఏ సమస్య వచ్చినా వీలైనంత వరకు ఇతరులపై ఆధారపడకుండా మనకు మనమే పరిష్కార మార్గాలను వెతుక్కోవాలి. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఏదో ఒక పరిష్కారం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఏ పనిలోనైనా పాజిటివ్ థింకింగ్ తో ముందడుగులు వేస్తే ఎంతటి లక్ష్యాలనైనా సాధించి విజయాన్ని అందుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: