జీవితం ఓ ప్రయాణం.. హాయిగా సాగనీ అన్నారో కవి.. మరి ఆ జీవితం సాఫీగా సాగాలంటే కొన్ని సత్యాలు తెలుసుకోవాలి. మన అనుభవం ప్రకారం ఆ సత్యాలు తెలుసుకునే లోగానే సగం జీవితం గడచిపోతుంది. అప్పుడు తెలిసినా చేసేదేమీ ఉండదు.

 

ఇక ఆ సత్యాలు ఏంటంటే.. వీటిని గుర్తుంచుకోవాలి.. నీ జీవితంలోని ప్రతి మలుపులో ఆ అయిదు గుర్తుంచుకోవాలి.. అవేంటంటే..

  1. ఆహారం

  2. విశ్రాంతి

  3. వ్యాయామం

  4. స్నేహితులు

  5. నీపైన నీకు విశ్వాసం....!

 

ఈ ఐదు నీకు జీవితాంతం తోడుగా ఉండాలి. సరైన ఆహారం తీసుకుంటే నీ ఆరోగ్యం బావుంటుంది. అది నీకు మంచి భవిష్యత్ ఇస్తుంది. నిరంతం పని ఒత్తిడి ఉంటే అది నీ జీవితానందాన్ని హరిస్తుంది. అందుకే తగినంత విశ్రాంతి తీసుకో.

 

సరైన వ్యాయామం నిన్ను ఎప్పుడూ ఫిట్ గా ఉంచుతుంది. అందుకే వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయకు. ఇక స్నేహితులు నీ విలువైన ఆస్తి. ఎందుకంటే.. వంద కారణాలు చూపినా, నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నిన్ను వదిలిపోరు. నీతో వుండటానికి ఇంకొక్క కారణం చూపిస్తారు. ఇక ఆత్మవిశ్వాసం ఎప్పుడూ నిన్ను కాపాడే కవచం.

ఈ ఐదూ నువ్వు గుర్తిస్తే.. ఆచరిస్తే.. నీ భవిష్యత్ బంగారమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: