జీవితంలో ఎవరితో ఎప్పుడు అవసరం పడుతుందో చెప్పలేం. మనం ఎంత పుడింగులం అనుకున్నా.. ఎప్పుడో ఓసారి ఎవరి సాయమైనా తీసుకోవాల్సి రావచ్చు. అలాంటప్పుడు అహంకారానికి పోకూడదు. నేనేంటి.. వాడి సాయం తీసుకోవడమేంటి అనుకోకూడదు.

 

ఎందుకంటే.. అంతటి శ్రీరాముడు కూడా రామాయణంలో ఎందరి సాయమో తీసుకున్నాడు.
శ్రీరామచంద్రుడు అరణ్యానికి వెళ్లేటప్పుడు మధ్యలో నది అడ్డువచ్చింది. గుహుడు తన పడవపై ఎక్కించుకొని ఆ నదిని దాటించాడు.

 

 

రావణాసురుడు సీతాదేవిని ఆకాశమార్గాన వంచనతో అపహరించుకొని వెళుతూ ఉంటే, జటాయువు పక్షి ఆమెను రావణుడి బారినుంచి రక్షించడానికి ఎంతో ప్రయత్నించింది.అంతటి శ్రీరాముడు వానర సైన్యాన్ని తన వెంట పెట్టుకొనే రాక్షస సైన్యాన్ని ఓడించగలిగాడు.

 

అంతేనా.. లక్ష్మణుడిని బతికించడానికి ఔషధమూలిక కోసం ఆంజనేయుడు ఒక పర్వతాన్ని పెకలించుకొని వచ్చాడు. ఎంత గొప్పవాడికైనా ఆఖరికి ఉడత సాయం కూడా అవసరం కావచ్చు. అందుకే జీవితంలో భేషజాలకు పోవద్దు. అహంకారానికి అస్సలు పోవద్దు. ఇతరుల సాయం తీసుకోవడం చిన్నతనం ఏమీ కాదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: