గురువారం కేరళ రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ప్రవేశపెట్టిన 2019 కి సంబంధించిన ఎకనామిక్ రివ్యూ లో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మిగతా రాష్ట్రాల కన్నా కూడా కేరళ రాష్ట్రం చాలా వేగంగా వృథాప్యం చెందుతున్న విషయం దీనిలో స్పష్టమయింది. అధిక వృద్ధాప్య జనాభాకు కారణాలను ఎకనామిక్ రివ్యూ తెలియజేసింది ఏమిటంటే 'సాధారణంగా మనదేశంలో పురుషుల కంటే మహిళల్లో ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది కానీ కేరళలో ఇది దానికి రెట్టింపు ఉంది. ఆరోగ్య సంరక్షణా సౌకర్యాలతో సాధారణ పెరుగుదల సీనియర్ సిటిజన్ల జనాభా నిష్పత్తిని నిరంతరం పెంచడానికి తోడ్పడుతుంది

 

అదీ కాకుండా ఇక్కడ అధిక వయస్సు ఉన్న పురుషులు తక్కువ వయస్సు గల మహిళలను వివాహం చేసుకోవడం చాలా సాధారణమైన విషయం. అందుకే దేశంలో వితంతువులు కూడా అధికంగా ఉండడానికి మరొక కారణం అయింది.  60 ఏళ్ళు దాటిన వారిలో పురుషుల కంటే ఎక్కువగా మహిళలే ఉన్నారు.. వారిలో కూడా ఎక్కువ మంది వితంతువులు ఉన్నారు.

 

ప్రస్తుతం, కేరళలో 48 లక్షల మంది (2018 లో జనాభా అంచనా గణాంకాలు ఆధారంగా) 60 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు 15 శాతం మంది 80 ఏళ్లు దాటినవారు ఉన్నారు. ఇది పాత లెక్కలతో పోల్చుకుంటే ఎక్కువ అని ఎకనామిక్ రివ్యూ చెప్పింది.

 

1980 నుండి, కేరళ మిగతా భారతదేశాన్ని అధిగమించింది.. 2001 లో వృద్ధాప్య జనాభా నిష్పత్తి 10.5 శాతానికి పెరిగింది, కానీ అప్పట్లో అఖిల భారత సగటు 7.5 శాతంగా ఉంది. 2011 నాటికి, కేరళ జనాభాలో 12.6 శాతం 60 సంవత్సరాలు దాటిన వారు ఉంటే అఖిల భారత సగటు 8.6 శాతంగా నమోదయింది. 2015 నాటికి, అఖిల భారత సగటు 8.3 శాతంతో పోలిస్తే కేరళలో 13.1 శాతానికి పెరిగిందని జనాభా డేటా బేస్ స్పష్టంగా తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: