మారుతున్న కాలంతో పాటు మనిషి ఆలోచనా తీరు కూడా ఎవరూ ఊహించని స్థాయికి వెళ్లిపోయింది. ఒకటి పోతే మరొకటి అంటూ మనిషి తన మెదడుని ఉపయోగించి ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తున్నాడు. దశాబ్దాలు మారుతూనే ఉన్నాయి కానీ మనిషి యొక్క పురోగతికి అదుపు లేకుండా పోయింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టెక్నాలజీ ఏమిటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా కృత్రిమ మేధస్సు.

 

మనిషికి తట్టిన విచిత్రమైన ఆలోచన ఏమిటంటే మన మెదడు వల్లే మనం ఇంత గొప్పగా బ్రతుకుతున్నాం అదే మన బదులు వేరే మెదడు మనకోసం ఆలోచించి మనకి అన్ని పనులు చేసి పెడితే ఎలా ఉంటుంది అని. దీనికి మనం పనివారిని పెట్టుకునేవారు జీతం అడుగుతారు కానీ యంత్రాలు ఎటువంటి జీతం అడిగావు కదా.

 

ఇందులో భాగంగా బయటకు వచ్చినవే అలెక్సా, సిరి ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్. ఇప్పుడు ఇవన్నీ మన జీవితంలో భాగమైపోయాయి. పాటలు పాడమని వాటికి చెప్పడం దగ్గరనుండి ఫ్యాన్, టివి లను స్టార్ట్ చేసే వరకూ అనేక పనులకు టూల్స్ ను వాడేస్తున్నారు. కొంత మంది సింగిల్ గాళ్ళు వాటితో సరసాలు ఆడుతున్నారు అది వేరే విషయం అనుకోండి. మార్కెట్లో అనేక రకాల పరికరాలు వచ్చినా కూడా అందరూ ఎక్కువగా వాడుతున్నది మాత్రం అలెక్సా నే. అయితే అమెజాన్ వారు ఇచ్చిన నివేదిక ఇప్పుడు కొంతమందిని ఆశ్చర్యానికి ముంచెత్తుతోంది.

 

గతేడాది నిమిషానికి వెయ్యి మంది యూజర్లు పాటలు ప్లే చేయమని అలెక్సాను కోరారంట. మరి గతేడాది ఎక్కువసార్లు రిక్వెస్ట్‌ చేసిన పాటేమయుంటుంది? అంటే హనుమాన్‌ చాలీసా. నిమిషానికి 4 సార్ల కన్నా ఎక్కువగా యూజర్లు చాలీసాను ప్లే చేయమన్నారు. తర్వాతి స్థా నంలోబేబీ షార్క్‌ఉంది. పాటను నిమిషానికి మూడుసార్లు అడిగారు. మూడో ప్లేస్ లో పంజాబీ పాటలాంబొర్గినినిలిచింది. అడిగిన పనులన్నీ చేసి పెడుతున్న అలెక్సాకు గతేడాది చాలా మందే లవ్‌ యూచెప్పారట. గతేడాది నిమిషానికోసారిలవ్‌ యూ అలెక్సాఅన్నారట. రెండు నిమిషాల కోసారివిల్‌ యు మ్యారీ మీఅని అడిగారట. కేవలం పని చేయమనే అలెక్సాను అడగట్లేదు. దాని బాగోగులు కూడా కొందరు అడుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: