ప్రేమికుల వారోత్సవాలలో రెండో రోజు "ప్రపోజ్ డే". ఈ రోజును పేరుకు తగ్గట్టే ఈ రోజున తాము ఇష్టపడేవారికి తమ ప్రేమను ప్రపోజ్ తెలియపరుస్తారు. వాళ్లు అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, చెప్పడం మనవంతు అంటూ వారి భావాలను తెలుపుతారు. కానీ, ఇది కేవలం అప్పుడే ప్రేమలో పడినవారికి కాదు. ప్రేమలో మునిగి తేలుతున్న వారు, అలాగే ఆల్రెడీ ఒక్కటైన జంటలు ఈ రోజుని చాలా అందంగా, ఆనందగా సెలబ్రేట్ చేసుకుంటూ తమ ప్రేమని తెలియపరుస్తారు. చాలామంది తమ హృదయంలో ఎన్నో రోజులుగా దాచుకున్న ప్రేమను వారికి వ్యక్తీకరించేందుకు ఈ రోజునే వారు ఎంచుకుంటారు. ప్రపంచం మొత్తం ఫిబ్రవరి 7 నుంచి ప్రేమికుల వారోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ వారోత్సవాల్లో రెండో రోజు శనివారం అనగా ఫిబ్రవరి 8 నాడు ప్రపోజ్ డేగా జరుపుకుంటారు.

 

Image result for happy propose day 2020

 

మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రతీఒక్కరూ అనుభవించే ఆ అందమైన ప్రేమని మీరు ఆస్వాదించాలంటే మీ లవర్ కి ప్రపోజ్ చేసేయండి. అయితే అలాగని ఊరికే కాదండి, మీకు ఇష్టమైనవారికి ఏమిష్టమో తెలుసుకొని అవి ఇచ్చి మరీ ప్రపోజ్ చేయండి. మీ లవ్‌ ని సక్సెస్ చేసుకోండి. మాములుగా సహజంగా ఎక్కువగా మంది రోజా పువ్వుని ఇచ్చి తన గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్‌ ను ప్రపోజ్ చేస్తా ఉంటారు. అయితే తన హృదయాన్ని చేరుకున్న వ్యక్తిని ప్రపోజ్ చేసే సందర్భం ఎంతో ఆస్వాదించాల్సిన విషయం. తన మనసు గెలిచిన వ్యక్తి ఏమని ప్రపోజ్ చేయొచ్చంటే, ఈ రోజు నా జీవితంలోనే చాలా గొప్ప రోజని అలాగే హ్యాపీ ప్రపోజ్ డే అని వ్యక్త పరచాలి.

 

Image result for ప్రపోజ్ డే

ఇంకా నువ్వు నా జీవితానికి కొత్త అర్థాన్ని చెప్పావు స్వీట్ హార్ట్ అంటూ మరోసారి "హ్యాపీ ప్రపోజ్ డే" అని తెలపండి. అలాగే కొద్దిగా మాటలలో ముందుకు వెళ్లి నేను నున్న మొదటిసారి చూసినప్పుడే నీ ప్రేమలో పడిపోయానని మరోసారి "హ్యాపీ ప్రపోజ్ డే" అని చెప్పండి. ఆ తర్వాత స్వీట్ హార్ట్, నీ చేయి పట్టుకుని, నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలనుకుంటున్నా అంటూ, నువ్వు లేనిదే నా జీవితానికి అర్థం లేదనుకుంటున్నా అని మీరు ఎవరినైతే లవ్ చేస్తున్నారో వారికి మనస్ఫూర్తిగా వాళ్లకి వినసొంపుగా ఆ అద్భుతమైన 3 పదాలు "ఐ లవ్ యూ" అని మీ రొమాంటిక్ యాంగిల్ లో వారికి తెలపండి. కాబట్టి చివరిగా చెప్పొచ్చేది ఏమిటంటే "ఆల్ ది వెరీ బెస్ట్" అని మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: