అభివృద్ధి చెందుతున్న కొద్దీ కులాలు, మతాల అంతరం తగ్గిపోవాలి. కానీ విచిత్రంగా ఇవి రోజురోజుకూ పెరుగుతున్నాయి. కులాభిమానాలు పెరిగిపోతున్నాయి. మా కులం గొప్ప అంటే మాకులం గొప్ప అన్న రీతితో విబేధాలు తీవ్రం అవుతున్నాయి.

 

 

ఎవరికైనా సొంత కులం పల్ల అభిమానం ఉండటం నేరం కాదు. కానీ అది దురభిమానంగా మారకూడదు. పిచ్చిగా వెర్రిగా మా కులం కాబట్టి ఎవరైనా గొప్ప.. అనే భావనలు మంచివి కాదు. ఇందుకు రామాయణంలో ఓ మాట ఉంటుంది. ఉత్తములు ఏ జాతిలో జన్మించినా, వారు ధర్మం వైపే మొగ్గుతారు.

 

 

ఈ సూక్తి ఇప్పుడు పాటించాల్సిన అవసరం ఉంది. అందుకే రామాయణంలో నీతిమంతుడైన విభీషణుడు తన సోదరుడైన రావణుడికి సహాయం చేయలేదు. ధర్మాత్ముడైన రాముడికి సాయపడ్డాడు.

 

 

పరస్త్రీని దొంగిలించడం మహాపాపం.. ఆ పాపం చేసింది సొంత అన్న అయినా విభీషణుడు క్షమించలేదు. మనం కూడా విభీషణుడి తరహాలో ఆలోచించాలి. ఉత్తములు ఏ జాతిలో జన్మించినా, వారు ధర్మం వైపే మొగ్గుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: