వారంలో ఏడు రోజులున్నా... ఆదివారం అంటేనే అందరికీ ఇష్టం. ఆదివారం ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకోవాలని కొందరు ఫిక్స్ అయితే... కుటుంబంతో సరదాగా తిరగాలని మరికొందరు భావిస్తారు. ముఖ్యంగా వీకెండ్‌ అనగానే నగర వాసులు అయితే షికారుకు సిద్ధమవుతారు. శని, ఆదివారాల్లో జాలీగా గడపాలని రెండు రోజుల ముందే పర్యాటక ప్రాంతానికి ఎంపిక చేసుకుంటున్నారు.  ఇంకొందరు క్రైస్తవులు మాత్రం ఆ రోజు చర్చికి వెళ్లి... దేవుడికి ప్రార్థన చేయాలనుకుంటారు. 

 

పెద్ద‌లు ఆఫీసుల‌కు.. పిల్ల‌ల‌కు స్కూల్‌కు వెళ్లి వెళ్లి ఆదివారం ఎప్పుడు వ‌స్తుందా అని చూసే వాళ్లు చాలా మంది ఉంటారు. ఆదివారం ఏం చేయాలి.. ఎలా ఎంజాయ్ చేయాలి అని అనుకునేవారు లెక్క‌కు మిక్కిలిగా ఉన్నారు. ఇలా చాలామంది వీకెండ్ వచ్చిందంటే ఇష్టం వచ్చిన ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు. అయితే కొంద‌రు మాత్రం ఇంటి వ‌ద్దే రెస్ట్ తీసుకోవ‌డానికి చూస్తుంటారు. వారంలో ఐదు రోజులు బండ చాకిరీ చేయడం... వీకెండ్‌ రోజున మిట్టమధ్నాహ్నం నిద్రలేవడం... ల్యాప్‌టాప్‌, టెలివిజన్‌లకు అతుక్కుపోవడం.. సాయంత్రం సినిమా లేదంటే పార్టీ.. మరుసటి రోజు మళ్లీ అదే ముక్తాయింపు... సోమవారం మళ్లీ జూలు విదల్చడం ఇలా జ‌రుగుతూ ఉంటుంది.

 

అయితే సండే అన‌గానే ఎంజాయ్ మెంట్‌తో పాటు.. ఫ్యామిలీ కేర్ కోసం కొంత స‌మ‌యం వెచ్చించ‌డం చాలా ముఖ్య‌మ‌ని అంటున్నారు ప‌రిశోధ‌కులు. మొత్తానికి సండే అన‌గానే బెడ్‌కే ప‌రిమితం కాకుండా.. స‌మ‌యాన్ని గ‌డిపేయ‌కుండా.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయ‌డం ద్వారా నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ కూడా బాగా ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశోధ‌కులు. సో.. సండే వ‌చ్చిందంటే బెడ్‌కే ప‌రిమితం కాకుండా ఫ్యామిలీకి టైమ్ కేటాయించి ఎంజాయ్ చేయ‌డం ఆరోగ్యానికి, మ‌న‌సుకు ఎంతో మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: