ఎంతో కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకుని బ్యాంకుల్లో దాచుకుంటే టెక్నాలజీ ని ఉపయోగించి కొందరు నేరగాళ్ళు ఆ సొత్తుని కాజేస్తున్నారు. ఖాతాలో ఎంత సొమ్ము ఉన్నా, అమాంతం లాగేస్తున్నారు. అవసరాలకోసం డబ్బు తీసుకునే సమయం వరకూ కూడా మనకి తెలియదు మన ఖాతాలో డబ్బు పోయిందని. ఇలా మోస పోయే వారిలో అత్యధికులు చదువులేని వాళ్ళే ఉంటున్నారు. అయితే  

 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 50లక్షల మంది  భారతీయుల బ్యాంక్ ఖాతాల వివరాలని గత కొంతకాలంగా సీక్రెట్ డేటా సేకరిస్తోంది. ఇప్పుడు ఈ సైట్ ని అమ్మకానికి పెట్టింది. దాంతో కోట్లు కుమ్మరించే సైట్ అమ్మకానికి వస్తే కొనుక్కోకుండా ఉంటారా..అందులోనూ ఒక్కో డెబిట్ కార్డు ఖరీదు రూ. 5 వేలు, ఒక్కో క్రెడిట్ కార్డు ఖరీదు రూ. 10 వేలుగా నిర్ధారించి అమ్మకానికి పెట్టడంతో సైబర్ నేరగాళ్ళు వాటిని కొనుగోలు చేసేశారు. దాంతో ఈ కార్డులని కొనుకున్న మోసగాళ్ళు ఆ డేటా సాయంతో క్లోనింగ్ కార్డులు తయారు చేసి ATM లలోకి వెళ్లి ఎంచక్కా దర్జాగా డబ్బులు డ్రా చేసుకుంటున్నారు.

 

క్రెడిట్ కార్డ్ క్లోనింగ్ చేసిన వాళ్ళయితే ఆన్లైన్ లోనే డబ్బు మొత్తం హాం ఫట్ చేస్తున్నారట.అసలు ఇంతమంది డేటా వారి చేతిలోకి ఎలా వెళ్ళింది..?? వారి ఐడీ, పాస్ వర్డ్ లు వారి చెంతకి ఎలా చేరాయి అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఫైనాన్షియ ఫ్రాడ్స్ అదే పనిగా చేస్తూ ఉండే ఓ సంస్థ గతకొన్నేళ్లుగా ఇదే పనిపై ఉందని తెలుస్తోందట. ఈ డేటా ని ప్రస్తుతం జోకెర్స్ స్టాష్ అనే వెబ్ సైట్ అమ్మకానికి పెట్టింది. ఇందులో డెబిట్, క్రెడిట్ కార్డుల Expire డేట్ అలాగే 14-16 డిజిట్ కార్డ్స్ నంబర్స్ , ఖాతాదారుల పేర్లు, CVV / CVC కోడ్స్ చివరికి వారి వారి ఈమెయిల్ అడ్రస్స్ లు కూడా అమ్మేస్తోందట.

 

ఇలా మొత్తం 4,61,976  కార్డులు ఒక్కొక్కటి 9 డాలర్లు కి అమ్మి రూ. 30కోట్లు పైగానే సదరు వెబ్ సైట్ ఆర్జించిందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై స్పందిస్తున్న బ్యాంకులు మీ ఖాతాల్లో  అనుమానిత ట్రాన్సాక్షన్ జరిగితే తప్పకుండా మీరు బ్యాంకు అధికారులని సంప్రదించాలని సూచనలు చేస్తున్నాయట. అందుకే మీ మీ ఖాతాలు ఖాళీ అయ్యయో లేదా అనే విషయాలు ఒక్క సారి చెక్ చేసుకుని అనుమానం ఉంటే వెంటనే బ్యాంక్ అధికారులని సంప్రదించండి అంటూ సూచనలు చేస్తున్నారు నిపుణులు.

 






మరింత సమాచారం తెలుసుకోండి: