ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. స్మార్ట్ ఫోన్ చేతిలో లేకుండా ఎవరూ ఉండటం లేదు. అందులోని వాట్సప్, యూట్యూబ్ వినియోగం కూడా బాగా పెరిగింది. అయితే ఈ రెండింటి కారణంగా ఫేక్ న్యూస్ కూడా బాగా పెరిగిపోయాయి.

 

సాధారణ వార్తల విషయం ఎలా ఉన్నా.. వాట్సాప్‌, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో వచ్చే ఆహారం, ఆరోగ్యం గురించి వచ్చే అన్ని రకాల వార్తలను గుడ్డిగా నమ్మొద్దు. మీకేదైనా సమస్య ఉంటే పోషకాహార నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.

 

వైద్య సమస్య ఉంటే.. సంబంధింత నిపుణుడిని కలవండి.. అంతే కానీ.. వాట్సప్, యూట్యూబ్ ల్లో చూసి సొంత వైద్యం చేశారంటే.. చిక్కుల్లో పడతారు. ప్రత్యేకించి యూట్యూబ్‌లో వ్యూస్ కోసం సంచలమైన తంబ్ నెయిల్స్ పెట్టి వీడియోలు పోస్టు చేస్తుంటారు.

 

వాటి పట్ల అట్రాక్ట్ అయ్యారంటే మీ ఆరోగ్యం చిక్కుల్లో పడుతుంది. అందుకే ప్రాధమిక సమాచారం కోసం వీటిని చదివినా నిపుణులను సంప్రదించాకే నిర్ణయం తీసుకోండి.లేకుంటే జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: