ఒక కౌగిలింతకు ఏమి ఖర్చవుతుంది చెప్పండి! కానీ అందులో ఎంతో ఆనందం వుంది. ఇష్టమైన మనిషి ఇచ్చే ఆలింగనం... అమృత సాగరం. భాగస్వామి యొక్క వెచ్చని కౌగిలింత.. ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.. ఇదో దివ్యమైన ఔషధం. సహచరిపై ప్రేమ మరియు మద్దతు చూపించడానికి ఉత్తమ మార్గం ఇదే. హగ్ డే, వాలెంటైన్స్ వీక్ యొక్క ఒక భాగం, రోజ్ డే తర్వాత, డే ప్రపోజ్, చాక్లెట్ డే, టెడ్డీ డే మరియు ప్రామిస్ డే తర్వాత వస్తుంది.. హగ్ డే. మీ వాలెంటైన్ వారాన్ని ఉల్లాసంగా గడపండి.  

 

ఇంకా.. దీన్ని ఒక ఆటలాగా కూడా ఆడవచ్చు. "బ్లైండ్ ఫోల్డ్ ప్రేమ" ఈ హగ్ డేని అమలు చేయడానికి సరైన ఆట. ఈ ఆటలో, ప్రతి జంట కళ్ళకు గంతలు కట్టుకోవాలి. ఇప్పుడు వారు కొన్ని టిప్స్‌తో తమ పార్టనర్‌ని కనుక్కోవాలి. ఆధారాల ఆధారంగా జంటలు ఒకరినొకరు కౌగిలించుకోవాలి. భాగస్వాములను రెండు వేర్వేరు వరుసలలో దూరంలో నిలబడేలా చేయండి. సంగీతం స్టార్ట్ అయినప్పుడు అందరూ కూడా హింట్స్‌తో ఒకరికొకరు గైడ్ చేయొచ్చు. ఇలా చివరికీ ఎవరైతే ముందగా తమ పార్టనర్‌ని హగ్ చేసుకుంటారో వారే విన్నర్.. అద్భుతం కదూ..

 

దీన్ని గిలిగింతల రోజు అని కూడా పిలవవచ్చు. మీరు ప్రేమంచిన వారిని మనసారా కౌగిలించుకోండి. గట్టిగా హత్తుకుని ఆమెపై మీ మదిలో ఉన్న ప్రేమను వ్యక్తం చేయండి. కౌగిలింతతో ఎదుటి వారికి మరింత దగ్గర కావొచ్చు. అందుకే మీ ప్రియురాలిని కౌగిలించుకుని తనపై మీకు ఉన్న ప్రేమను తెలపండి. కౌగిలి.. మీ ఇద్దరి ప్రేమకు ఉత్తమ లోగిలి.. వాలైంటెక్ వీక్ లో ఒక రొమాంటిక్ కౌగిలి అనేది మీ ఇద్దరి జీవితాలకు మంచి అనుభూతి కావాలి.. మీ సంబంధాన్ని మరింత బలపరచుకోవాలి.

 

కౌగిలింత ఒక తీపి స్నేహితుడు.. ఒక దిండు వంటిది..
మీరు అలసినప్పుడు మీరు దానిపై నిద్రపోతారు..
మీరు విచారంగా ఉన్నప్పుడు మీరు దానిపై కన్నీళ్లను కారుస్తారు..
మీరు కోపంగా ఉన్నప్పుడు మీరు దాన్ని వంచి.. విసిరి వేస్తారు..
మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు దాన్ని చుట్టుకుపోతారు.
హ్యాపీ హగ్ డే!

మరింత సమాచారం తెలుసుకోండి: