ప్రేమ.. మరో రెండు రోజుల్లో ప్రేమికుల దినోత్సవం. అందుకే ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడుతున్నాం. ప్రేమకు ఉన్న పవర్ గురించి మాట్లాడుతున్నాం. అలాంటి ఈ ప్రేమకు ఉన్న శక్తిని ఆకర్షణతో పోల్చి తక్కువ చేస్తున్నారు కొందరు. అయితే ప్రేమకు ఆకర్షణకు తేడా ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

చిన్నప్పుడు కూడా ప్రేమ పుదుతుంది.. పుట్టదు అనేది ఏమి ఉండదు.. కానీ 18ఏళ్ళ వయసులోపు పుట్టే ప్రేమలో చాలా ప్రేమలో ప్రేమ ఉండదు.. కేవలం ఆకర్షణే ఉంటుంది. ఇంకా ప్రేమకు ఆకర్షణకు తేడా ఏంటి అంటే? ఆకర్షణ ముఖం అందంలో.. మనిషి రూపానికి.. ఇంకా వాళ్ళు చేసే పనులకు ఆకర్షితులు అవుతారు.. దీన్నే ఆకర్షణ అంటారు. 

 

ఇంకా ప్రేమ విషయానికి వస్తే.. ఎంతో అద్భుతమైన ప్రేమ అది.. ఒక మనిషి రూపానికో.. మనిషి ఆస్తిపాస్తులకో కాదు.. ఆ మనిషి అందానికో కాదు.. ఏం ఉన్న లేకపోయినా మంచిమనసు అనేది ఉంటె ఆటోమేటిక్ గా ప్రేమ పుడుతుంది... రూపం పాడైన.. అందం పాడైన.. ఆస్తుపాస్తులు పోయిన ఆ మనిషిని ప్రేమించడం మాత్రం మారారు.. 

 

ఎన్ని కష్టాలు వచ్చిన సరే.. ప్రేమ కారణంగా ఆ కష్టాలను తట్టుకుంటారు.. వాళ్ళు కష్టపడినా పర్లేదు వారు ప్రేమించిన వారికీ మాత్రం కష్టం రాకూడదు అనుకుంటారు.. అదే ఆకర్షణకు ఆకర్షితులు అయినా వారు కష్టం వచ్చింది అంటే.. అవసరమా ఈ ప్రేమ అని ప్రశ్నిస్తారు.. అసలు వద్దె వద్దు అని వెళ్ళిపోతారు.. అదే ప్రేమకు.. ఆకర్షణకు.. తేడా. 

మరింత సమాచారం తెలుసుకోండి: