మనం ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి కౌగిలో కరిగి పోవాలని ప్రేమికులు అనుకుంటూ వస్తున్నారు. ఈ సందర్బంగా ఒక్కొక్కరి ఒక్కోలా బిగి కౌగిలిలో బందీ కావాలని అనుకుంటారు. అప్పుడే తమ మనసులోని భావాలు అర్థమయిపోతాయని వారి నమ్మకం. అందుకే చిన్న చిరునవ్వు మనసును హత్తుకొనే ఒక హగ్ సన్నిహితులు ఇచ్చుకుంటారు. అలా వారి మధ్య అన్యోన్యతను హగ్ ద్వారా తెలియపరుస్తున్నారు. అందుకే ప్రతి ఏడాది ప్రేమికుల రోజుగా ఫిబ్రవరి 14 న జరుపుకుంటారు.

 

ఈ నేపథ్యంలో వారం రోజుల నుండి ఒక్కో రోజు ఒక్కో విదంగా జరుపుకుంటారు. అయితే ఈ మేరకు హగ్ డే కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. అసలు ఈ హగ్ ను ఎందుకిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.. వాలెంటైన్స్ డే రెండు రోజుల ముందు జరుపుకునే హగ్ డే జరుపుకుంటారు. హగ్ డే యొక్క ప్రాముఖ్యత దాని పేరులో స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజున జంటలు కనీసం ఒక కౌగిలింతనైనా పంచుకోవడం వాలెంటైన్స్ వీక్లో భాగంగా వస్తున్న ఆనవాయితీ. కౌగిలింత అనేది, ప్రేమ, స్వచ్చత, భద్రతల భావవ్యక్తీకరణగా ఉంటూ, మీ ప్రేమ ఎంత సురక్షితమైనదోనని మీ భాగస్వామికి తెలియజేస్తుంది. వాస్తవానికి, కౌగిలించుకోవడం, మెదడులో ఆక్సిటోసిన్ విడుదలను పెంచుతుంది. ఇది న్యూరోట్రాన్స్మిటర్ గా ఉంటూ వ్యక్తుల మద్య సంబంధాలను పెంచుతుంది. 

 

రోజుకో యాపిల్, వైద్యుని దూరంగా ఉంచుతుంది అన్నమాట నిజమో కాదో తెలీదు కానీ, రోజుకో కౌగిలింత మాత్రం ఆ పని చేస్తుంది. జీవితానికి సరిపడా ప్రిస్క్రిప్షన్. హ్యాపీ హగ్ డే!నా కష్టాన్నీ నీ కౌగిలింతతో మాయం, నిన్ను కౌగిలించుకున్నప్పుడు, నా ఈ జీవితం సంపూర్ణమైంది అన్న భావన కలుగుతుంది. హ్యాపీ హగ్ డే.. నా ప్రేమను వ్యక్తపరచడానికి మాటలకన్నా, ఈ కౌగిలింత మరిన్ని ఎక్కువ భావాలను పలికిస్తుంది. హ్యాపీ హగ్ డే!

 

ఇలా ప్రేమను అనుభూతి పొందటానికి చాలా మంది ఈ హగ్ ద్వారా ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. అందుకే ఎలాంటి భాదనైనా ఈ కౌగిలి దూరం చేసి ప్రేమను మరింత పెంచుతుందని అందరు నమ్ముతారు. ఇన్నీ లాభాలున్నా ఈ హగ్ ఒక్క రోజు ఎందుకు ప్రతిరోజు ఇవ్వండం మంచిదే కదా అని సదరు అభిప్రాయపడుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: