మనకు చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్పే పాఠాలు.. మన నిజ జీవితంలో అనుసరించాల్సిన పాఠాలు వేరుగా ఉంటాయి. మంచి బాలుడిలా ఉండాలి.. అందరికీ సాయం చేయాలి..పెద్దల ఎడల గౌరవంగా ఉండాలి.. అబద్దాలు ఆడకూడదు..ఈ జాబితా ఇలా సాగుతూ పోతుంది.

 

కానీ రియల్ లైఫ్ లో ఈ సూత్రాల్లో కొన్ని పాఠిస్తే ఇరుకున పడతాం. ఉదాహరణకు అందరికీ సాయం చేయాలని పెద్దలు చెబుతారు. అందుకే మనం అన్ని విషయాల్లో సాయం అడిగిన వారందరికీ ఎస్ చెప్పేస్తుంటాం. ఇది మంచి అలవాటే అయినా కొన్నిసార్లు కొంప ముంచుతుంది.

 

ఉదాహరణకు పెద్దగా తెలియని వారికి కూడా బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం, మీకు అంతగా నమ్మకం లేని వారికి కూడా చిట్ ఫండ్ సంస్థలకు ష్యూరిటీలు ఇవ్వడం.. మీకు అంతగా తెలియకపోయినా ఉద్యోగాల కోసం సిఫారసులు చేయడం వంటివి మిమ్మల్ని ఇబ్బందులపాలు చేస్తాయి.

 

అంత్యనిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు అంటారు. అది ఈ విషయంలో బాగా వర్తిస్తుంది. నో చెప్పడానికి కాస్త ఇబ్బందిపడినా...అది మిమ్మల్ని భవిష్యత్ లో రాబోయే ప్రమాదాల నుంచి కాపాడుతుంది. అందుకే కాస్త నో చెప్పడం కూడా నేర్చుకోండి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: