కళ్యాణం వచ్చినా..కక్కొచ్చినా ఆగదని అంటారు పెద్దలు. సామెతలు ఊరికే రావు అనుభావల నుంచీ పుట్టుకొచ్చేవే. అందుకే పెద్దలు చెప్పే కొన్ని విషయాలు..మంచి విషయాలు బుర్రకి ఎక్కించుకోవాలి. పెద్దల సలహాలు సూచనలు పాటిస్తేనే జీవితంలో ఒక అడుగు ముందుకు పడుతుంది. లేకపోతే ఎన్నో తీవ్ర అనర్దాలు జరిగిపోతాయి. ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది...వివరాలలోకి వెళ్తే..

 

హైదరాబాద్ లోని ఉప్పల్ కి చెందిన 24 ఏళ్ళ ఓ యువ టెకీ నిహ్కిల్ గౌడ్ తన చదువు పూర్తి చేసుకోగానే మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగాన్ని సాధించాడు. ఎంతో సరదాగా సంతోషంగా చదువు తరువాత వెంటనే వచ్చిన ఉద్యోగాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఎటువంటి లోటు లేకుండా ఎంతో హాయిగా ఉంటున్న వారి కుటుంభంలో ఈ హటాత్ పరిణామం తీవ్ర విషాదాన్ని నింపింది.  పోలీసులు తెలిపిన కధనం ప్రకారం..

Techie Commits Suicide After <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PARENTS' target='_blank' title='parents-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>parents</a> Ask to Wait for Marriage

రెండేళ్ళ క్రితం  నిహ్కిల్ గౌడ్ అక్కకి పెళ్లి అయ్యింది. అప్పటి నుంచీ నిహ్కిల్ కూడా తనకి కూడా పెళ్లి చేయాలని తల్లి తండ్రులపై ఒత్తిడి తెస్తూ వచ్చాడు. అయితే తల్లి తండ్రులు మాత్రం నువ్వు చిన్న పిల్లాడివి అప్పుడే పెళ్లి వద్దు కొంత కాలం వేచి ఉండమని కోరారు. అయినా సరే పెళ్లి కోసం అతడు తల్లి తండ్రులని ఇబ్బంది పెట్టేవాడని, చిన్న వయసు వద్దని ఎంతగా చెపినా వినేవాడు కాదని పోలీసులు తెలిపారు.

 

ఈ క్రమంలోనే సోమవారం నాడు తల్లి తండ్రులు బయటకి వెళ్ళిన సమయంలో తన రూమ్ లోని సీలింగ్ ఫ్యాన్ కి ఉరి వేసుకుని మరణించాడని తెలుస్తోంది. ఈ ఘటన చూసిన తల్లి తండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన ఘటన స్థలంలో వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. అయితే కేవలం పెళ్లి అవ్వడం లేదనే కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడా లేదా వేరే ఏదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: