ఒక పక్క అమ్మాయి ప్రేమ లో వుంటూ మరో పక్క ఉద్యోగం లేక కెరియర్ గురించి ఆలోచిస్తూ సంవత్సరాలు సంవత్సరాలు గడిపేస్తున్న ప్రేమికులు ఎంతమంది ప్రస్తుత సమాజంలో ఉన్నారు. ఒకపక్క ఇంటిలో ఉన్న పెద్దలు వయసు మీద వచ్చింది పెళ్లి చేసుకోవాలి వయసులో జరగాల్సిన పని వయసులో జరగాలి...అంటూ తెగ చిరాకు పుట్టించే మాటలు మరో పక్క ప్రేమించిన అమ్మాయి లేకపోతే అబ్బాయి ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటూ వేధించే మనస్సును గాయపరిచే మాటలతో చాలా మంది ప్రస్తుత రోజుల్లో ఉన్న ప్రేమికులు తెగ ఇబ్బంది పడుతుంటారు.

 

విధంగా ప్రేమించాలి మరోపక్క విధంగా కెరీర్ ని ముందుకు సాగించాలి అసలు సమస్య కి పరిష్కారం ఉందా..? అన్నా ఆలోచనల్లో మునిగిపోతూ ఇబ్బందులకు గురి అవుతారు. అయితే సమస్యకు పరిష్కారం ఏమిటంటే ప్రేమించే వ్యక్తి ఒక పక్క ఉద్యోగం చేస్తూనే మరో పక్క డబ్బులు వచ్చేదాకా పెళ్లి చేసుకోను కెరీర్ కోసం ఆలోచిస్తూ ఉంటే పనేమీ సాగదు. ప్రేమించిన వ్యక్తులు కష్టంలో సుఖంలో ను కలిసి ఉంటేనే అది ప్రేమ.

 

బాగా డబ్బు ఉండాలి అప్పుడే పెళ్లి చేసుకుంటాను ప్రేమిస్తాం అని అనుకుంటే మాత్రం అది పొరపాటే. అన్ని రోజుల్లో డబ్బులు ఉండవు...అసలు ప్రేమ ఉన్నచోట డబ్బు ఉండదు. డబ్బులు లేని చోట ఒక మనిషిని నిస్వార్ధంగా నమ్మటమే ప్రేమ. కాబట్టి ప్రేమకి మరియు కెరియర్ మధ్య సతమత మయ్యే వాళ్ళు పరిష్కారం కోసం వెతికే వాళ్లకి...సమాధానం ఏమిటంటే కష్టంలోనూ అన్ని విషయాల్లోనూ నిలబడేది ప్రేమ.

మరింత సమాచారం తెలుసుకోండి: