ప్రేమికుల రోజు అంటే ఏంటి అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయనుకొండి.. ప్రేమ అనేది మనసుకు సంబందించిన అనుభూతి అయితే, ఈ ప్రేమను ఒక పండగ అని ఎందుకు అనుకుంటారు అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. కొంతమంది ప్రేమ ఎలా పుడుతుంది. ఎందుకు పుడుతుంది.. ఏ వయసులో పుడుతుంది అనేది తెలుసుకోవాలని కుతూహాలంగా ఉంటారు. ఇకపోతే అసలైన ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం.. 

 

ప్రేమ అనేది రెండు మనసుల కలయిక.. ఒక తియ్యని అనుభూతి ప్రేమనుకు ఎంతగా ప్రేమిస్తామో అంతగా ఆ ప్రేమ మనల్ని ప్రేమిస్తుంది అని ప్రేమికుల నమ్మకం.ఒక మనిషిని ప్రేమించడం అంటే ప్రాణాలను అర్పించడం అని ప్రేమికులు అంటుంటారు. అది నిజమే అని కవులు కూడా అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రేమ ఒక మైకం అని  రోజులు పోయే కొద్దీ ప్రేమ అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. 

 

ఒకప్పుడు ప్రేమ అనేది కేవలం కలిసి తిరగడమే కాకుండా కల్యాణ వేదిక వరకు వెళ్లి వివాహ బంధంతో ఒకటై కుటుంబాన్ని ఏర్పరచుకొని వారు. కానీ ఈ మధ్య కాలంలో ప్రేమ అనేది కేవలం పబ్బులలో తిరగటానికి, పదిమందికి గొప్పగా చెప్పుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. పెళ్లి వరకు అతి కొద్దీ మంది మాత్రమే వెళ్తున్నారు.. 

 


మరో విషయమేంటంటే ప్రతి ఏడాది ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజును జరుపుకుంటారు. ఈరోజున ప్రత్యేకంగా తమ ప్రేయసి, ప్రియుడికి  ఈ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెపడంతో పాటుగా ప్రత్యేకంగా ఉండటానికి బాహుమతులను కూడా ఇస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ ప్రేయసి లేదా ప్రియుడు మరింత దగ్గరవుతారని వారి నమ్మకం. ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడం వల్ల వారి అభిప్రాయలు కలిసి జీవితం హాయిగా ఉంటుందని ప్రేమ నిపుణులు అంటున్నారు. మీ ప్రేమ పదికాలాల పాటు హాయిగా ఉండాలని కోరుకుంటూ  హ్యాపీ వ్యాలెంటెన్స్ డే 

మరింత సమాచారం తెలుసుకోండి: