అమ్మ అవ్వడం స్త్రీలకు దక్కిన అదృష్టం మరియు గౌరవం. అమ్మ తన ప్రేమని స్వార్థం లేకుండా అందిస్తుంది. ఇక  గ‌ర్భంతో ఉన్నప్పుడు తీసుకునే ఆహరం పుట్టబోయే పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే సాధారణంగా కన్నా గ‌ర్భంతో ఉన్నప్పుడు తీసుకునే ఆహరం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గర్భం దాల్చిన తర్వాత స్త్రీల ఆలోచనలలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. మ‌రియు కొంచెం ఆందోళన కూడా ఉంటుంది.  కానీ దాని కంటే మీ బిడ్డ కడుపులో ప్రాణం పోసుకుంటున్నాడు అనే ఆనందమే ఎక్కువ ఉంటుంది. 

 

అలాగే ప్రతి క్షణం కడుపులోని శిశువు గురించే ఆలోచన చేస్తూ తమలో తామే మధనపడుతూ ఉంటారు. అయితే గర్భంతో ఉన్న మహిళ ఏడవటం వలన బిడ్డపై ఏదైనా ప్ర‌భావం చూపుతుందా.. అస‌లు గర్భంతో ఉన్న‌ప్పుడు ఎడ‌వ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా క‌డుపుతో ఉన్న‌ప్పుడు పెద్ద‌వాళ్లు, వైద్యులు ఎప్పుడు నవ్వుతూ, సంతోషంగా ఉండాలని చెబుతుంటారు. అయితే ప్రెగ్నన్సీ సమయంలో విచారం ఉండటం, మూడీగా ఉండటం సహజమే కానీ ఎప్పుడు ఇలా ఉండకూడదు. ఎందుకంటే పుట్ట‌బోయే పిల్ల‌ల‌పై ఖ‌చ్చితంగా ఆ ప్ర‌భావం ఉంటుంద‌ట‌. 

 

ఇక బయటి శబ్దాలను, మాటలను తల్లి కడుపులో శిశువు  గ్రహించగ‌ల‌డ‌ని మ‌న‌కు తెలుసు. అయితే కేవ‌లం శ‌బ్దాల‌నే కాదు.. మ‌న ఎమోషన్స్ కూడా కడుపులోని బిడ్డకు తెలుస్తాయి. మీరు సంతోషంగా, నవ్వుతూ ఉంటే బిడ్డ కూడా అలానే ఉంటాడు. మీరు ఏడుస్తూ బాధపడటం చేస్తే కడుపులో శిశువు అలానే ఉంటారు. అంతేకాకుండా.. గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు త‌ల్లులు ఎప్పుడు విచారం, బాధపడటం వల్ల‌ పిల్లల పెరిగి పెద్దయ్యాక విచారంగా ఉండటం, ఆక్టివ్ గా లేకపోవడం జరుగుతుంద‌ట‌. సో.. గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు ఎప్పుడూ సంతోషంగా, యాక్టీవ్‌గా ఉండండి..!

మరింత సమాచారం తెలుసుకోండి: