నేటి మంచి మాట.. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో.. మహాకవి శ్రీ శ్రీ రాసిన వ్యాఖ్యలలో ఇది ఒక్క వ్యాఖ్యం మాత్రమే.. అయన రాసిన ఒక్కో వ్యాఖ్యం చదువుతే నీలో ఏదో దైర్యం వచ్చేస్తుంది.. నిన్ను నువ్వు ప్రశ్నించుకొని నీ గమ్యాన్ని చేరుకోడానికి దగ్గర అవుతావు.. 

 

అబ్బా ఒక్క వ్యాఖ్యంతో అంతలా డెవలప్ అవుతారా? అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవచ్చు.. కానీ ఇది నిజం. అయన రాసిన ప్రతి వ్యాఖ్యం ఒక్క నీకు మాత్రమే కాదు నీ ముని మానవరాళ్లకు కూడా ఈ వ్యాఖ్యలు సరికొత్త ఉత్తేజాన్ని తెస్తాయి. ఇంకా పైన చెప్పిన వ్యాఖ్యం గురించి మాట్లాడితే.. 

 

నీ జీవితంలో నువ్వు ఏది సాధించలేవు అని.. నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్న సమయంలో.. నీ శరీర ఆకృతుని పట్టించుకోకుండా కుమిలిపోతున్న సమయంలో నువ్వు అద్దాన్ని చుసిన సమయంలో నువ్వు ఎందుకు ఇలా అవుతున్నావ్ అని అద్దం ప్రశ్నించకముందే నీ జీవితాన్ని సరిద్దిదుకో.. అందమైన జీవితంగా మార్చుకో. ఇవి శ్రీ శ్రీ చెప్పిన మాటలు.. వినడానికి అందంగా ఆచరించడానికి కష్టంగా ఉంటాయి. కానీ ఆచరిస్తే నీ జీవితం తారాస్థాయిలో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: