కాలం మారుతోంది... ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండేది మార్పు ఒక్కటే.. అందుకే కాలంతోపాటు మనమూ మారాలి. మారకపోతే.. వెనుకబడిపోతాం. అంతే కాదు.. మన తోటి ప్రపంచం ముందుకు దూసుకెళ్లిపోతుంటే.. మనం మాత్రం ఎదుగు బొదుగూ లేకుండా ఉండిపోతాం.

 

 

అందుకే.. ఏదో నా పని నేను చేసుకుంటూ పోతున్నా.. నాకు ఈ లోకంతో పని లేదు.. అనే ధోరణి సరికాదు. మన పని మనం చేసుకుంటూనే... కొత్త గా వస్తున్న మార్పులపై ఓ కన్నేసి ఉంచాలి. ఆ మార్పులన్నీ మనం స్వీకరించాల్సిన అవసం లేకపోయినా.. వాటిపై అవగాహన ఉన్నప్పుడే జీవితంలో రాణించగలం.

 

 

ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాల కారణంగా కొత్త రంగాలు పుట్టుకొస్తున్నాయి. సరికొత్త అవకాశాలు అందివస్తున్నాయి. వాటి గురించి కాస్త అవగాహన పెంచుకోవాలి. అవి మీ జీవన శైలిని మరింత సులభం చేస్తాయి. మీకు ఉపకరిస్తాయి కూడా. ఇందుకు కావాల్సింది నేర్చుకోవాలన్న తపన, జిజ్ఞాస మాత్రమే.

 

 

ఈ మార్పు నలుగురికి ఉపాధి కల్పించే శక్తినిస్తుంది. లాభాలు తక్కువ ఉన్నా భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యాపారాన్ని ఎంచుకుంటే అందులో రాణిస్తారు. వనరులను వినియోగించుకోవడంలోనే మన విజయసూత్రం దాగి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: