ఈ మధ్య కాలంలో యువతలో చాలామంది లక్ష్యాలను సాధించే ప్రతిభ, సామర్థ్యం ఉన్నా ఇతర కారణాల వలన తమ లక్ష్యాలను సాధించలేక విలువైన సమయాన్ని వృథా చేసుకుంటూ కెరీర్ ను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ, ఆకర్షణలకు లోనై తమ లక్ష్యాలను నిర్లక్ష్యం చేస్తూ సరైన ఉద్యోగం లభించక, కెరీర్ లో ఉన్నత స్థానాలకు ఎదగలేక జీవితాతం ప్రేమ, ఆకర్షణల వలన కెరీర్ నాశనమైందని బాధ పడుతూ ఉన్నారు. 

యువతలో కొందరు కెరీర్ ను, లవ్ ను బ్యాలన్స్ చేసుకుంటూ విజయం సాధిస్తున్నప్పటికీ ప్రేమ, ఆకర్షణల వలన కెరీర్ విషయంలో తప్పటడుగులు వేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గంటలు గంటలు ఫోన్ కాల్స్, చాటింగ్ లతో కాలం గడిపేస్తూ బంగారంలాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటూ యువతలో మెజారిటీ శాతం కెరీర్ విషయంలో వారు చేసిన తప్పులు, పొరపాట్లు సరిదిద్దుకోలేని స్థితికి చేరుకుంటున్నారు. 
 
కెరీర్ విషయంలో చేసిన తప్పుల వలన యువతలో కొందరు నిరాశానిస్పృహలకు లోనై చెడుఅలవాట్లకు బానిసలవుతున్నారు. యువత తమ జీవితంలో కెరీర్ కు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అనుకున్న లక్ష్యాలను సాధిస్తే ఇతర విషయాలలో విజయం సాధించటం పెద్ద కష్టమేమీ కాదని గుర్తించాలి. కెరీర్ విషయంలో సరైన దిశలో అడుగులు వేస్తూ లక్ష్యాలను సాధిస్తే సమాజంలో గౌరవం, గుర్తింపుతో పాటు చేపట్టిన ఏ పనిలోనైనా సులభంగా విజయాలను అందుకునే అవకాశాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: