ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఆ లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేస్తారు. కొందరు కోరుకున్న విధంగా లక్ష్యాలను సాధించడంలో సక్సెస్ అయితే మరికొందరు మాత్రం ఆ లక్ష్యాలను సాధించడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. లక్ష్యాలను సాధించడంలో ఫెయిల్ అయితే ఫెయిల్ కావటానికి ఏవేవో కుంటిసాకులను వెతుక్కుంటూ ఉంటారు తప్ప ఫెయిల్ కావడానికి తాము చేసిన తప్పులేంటో మాత్రం అర్థం చేసుకోరు. 
 
జీవితంలో చేపట్టిన ఏ పనిలోనైనా విజయం సాధించలేకపోతున్నామంటే మొదట మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. లక్ష్యాలను సాధించలేకపోవడానికి గల కారణాలను కనుక్కొని ఆ కారణాలకు పరిష్కారమార్గాలను కనుగొనాలి. మనలో ఉండే బలహీనతల కారణంగా లక్ష్యాన్ని సాధించటంలో విఫలమవుతున్నామని గ్రహిస్తే మాత్రం మన బలహీనతలను అధిగమించడానికి మన వంతు ప్రయత్నాలను చేయాలి. 
 
లక్ష్యాన్ని సాధించడంలో మనల్ని మనం విమర్శించుకున్నా ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కాకపోతే స్నేహితుల ద్వారా, లక్ష్యాలను సాధించిన వారి ద్వారా మన తప్పులేంటో మనం తెలుసుకోవాలి. ఆ తరువాత సరైన ప్రణాళిక వేసుకొని ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలి. ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ తప్పులు, పొరపాట్లను గుర్తిస్తూ ఆ తప్పులు, పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందడుగులు వేస్తే మాత్రం లక్ష్యాన్ని సాధించి విజయాన్ని సొంతం చేసుకోవడం పెద్దకష్టమేమీ కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: